ఎన్టీఆర్ తన కొత్త చిత్రం “దేవర”తో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ప్రస్తుతం, “దేవర” సినిమా ప్రమోషన్లు పాన్ ఇండియా స్థాయిలో జరుగుతున్నాయి. ఇటీవల ముంబైలో ఎన్టీఆర్ అలియా భట్‌తో కలిసి పలు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా చేశారు.
ఇక తాజా సమాచారం ప్రకారం, తెలుగులో “దేవర” సినిమా కోసం ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివతో కలిసి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కూడా పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ షూట్ జరుగుతుండగా, మూవీ యూనిట్ ఒక ఫోటోను లీక్ చేసింది. ఆ ఫోటోతో పాటు ఈ మాస్ ఇంటర్వ్యూ రాబోతోందని హింట్ ఇచ్చారు.
విశ్వక్ సేన్ ఎన్టీఆర్ అభిమానిగా పాపులర్. గతంలో విశ్వక్ సినిమాల ఈవెంట్లకు ఎన్టీఆర్ హాజరయ్యారు. అలాగే, సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఎన్టీఆర్‌కు సన్నిహితుడు అయ్యాడు. ఈ ముగ్గురు హీరోలు ఇటీవల “టిల్లు స్క్వేర్” సమయంలో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురితో రాబోతున్న స్పెషల్ ఇంటర్వ్యూ ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది, అందరూ ఈ ఇంటర్వ్యూకి ఎదురుచూస్తున్నారు.