సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. తెరపై కనిపించే నటీ, నటులకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ నిజ జీవితంలో వారి జీవితం వేరు. ఒకప్పుడు కమెడియన్, కామెడీ విలన్, విలన్ గ్యాంగ్ లో సహాయ పాత్రలు పోషించి మెప్పించిన టాలీవుడ్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు.
పెద్ద పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ చిన్న స్థాయి నటుడు తన బాడీ లాంగ్వేజ్, అమాయకపు హావభావాలతో ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. ఫిష్ వెంకట్ హెల్త్ ప్రస్తుతం సీరియస్‌గా ఉండటంతో, లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఫిష్ వెంకట్ ప్రస్తుతం రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫైనాన్షియల్ కండీషన్ కూడా సీరియస్‌గా ఉండటంతో వైద్య ఖర్చులు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు పెద్ద మనసు చేసుకొని సాయం చేయాలని వేడుకుంటున్నారు.