టాలీవుడ్‌లో డజనుకు పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రముఖ నటి రెజీనా కాసాండ్రా సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. 2012లో విడుదలైన “శివ మనసులో శృతి” చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె, సాయి ధరమ్ తేజ్, రవితేజ, నారా రోహిత్, సందీప్ కిషన్ వంటి హీరోలతో కలిసి నటించి మంచి గుర్తింపు పొందింది.
ప్రస్తుతం రెజీనా “ఉత్సవం” అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా తన వ్యక్తిగత జీవితం పై స్పందిస్తూ, మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌తో పెళ్లి సంబంధిత రూమర్ల గురించి మాట్లాడారు. సాయి తేజ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని కొందరు ప్రేమగా భావించి పెళ్లి పుకార్లు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు.
“ఉత్సవం” చిత్రం విషయానికొస్తే, సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో దిలీప్ ప్రకాష్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అలీ, నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ప్రేమ మరియు భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.