గత కొద్ది కాలంగా టాలీవుడ్(Tollywood) సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టకుండా సీక్రెట్‌గా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా, టాలీవుడ్ యంగ్ హీరో నార్కే నితిన్(Narne Nithinchandra) బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. నేడు హైదరాబాద్‌లో నార్కే నితిన్ నెల్లూరు జిల్లాకు చెందిన శివాని(Shivaani)తో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్(NTR), ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi), తనయులు అభయ్, భార్గవ్‌తోపాటు కల్యాణ్‌రామ్, వెంకటేశ్(Venkatesh), తదితరులు సందడి చేశారు.
కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక నార్కే నితిన్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాసరావు(Srinivasa Rao) కొడుకు అయిన నార్కే నితిన్‌చంద్ర ఎన్టీఆర్ బావ మరిదిగా (లక్ష్మీ ప్రణతి సోదరుడు) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. 2023లో విడుదల ‘మ్యాడ్’(mad) సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించాడు. అలాగే ఇటీవల నార్కే నితిన్ నటించిన ‘ఆయ్’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.