మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “గేమ్ చేంజర్” చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 2024లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం తర్వాత, రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ RC16 కోసం బుచ్చిబాబు సన దర్శకత్వంలో సన్నద్ధం అవుతున్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామ్ చరణ్ తన కుటుంబంతో గడుపుతున్నారు. ఈ సందర్భంగా, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల, తన కుమార్తె క్లిన్ కారాతో కలిసి శ్రీకృష్ణుడికి పూజ చేస్తూ ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, మరియు అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.