వరుణ్ తేజ్(Varun Tej), కరుణ కుమార్ (Karuna Kumar) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘మట్కా’(Matka). ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్(Vyra Entertainments), ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), నోరా ఫతేహి(Nora Fatehi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘మట్కా’ నవంబర్ 14న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘మట్కా’(Matka) ప్రమోషన్స్‌లో పాల్గొన్న వరుణ్ తేజ్(Varun Tej) పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘‘సింగిల్‌గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో సంతోషంగా గడిపాను. వారితో అన్ని విషయాలు పంచుకునేవాడిని. కాకపోతే ఫ్రెండ్స్ మనతో ఎప్పటికీ ఉండరని కొంత కాలానికి అర్థమైంది. మన జీవితానికి సంబంధించినన ప్రతి విషయాన్ని, విజయాన్ని పంచుకోవడానికి జీవితంలో మనకంటూ ఒక భాగస్వామి ఉండాలని తెలుసుకున్నా. ఒక బంధం బలంగా ఉండాలంటే సరైన వ్యక్తిని ఎంచుకోవడంలోనే ఉంటుంది. అలా కాకుంటే.. జీవితం నరకమే అవుతుంది. దాదాపు నేను లావణ్య(Lavanya Tripathi) ఏడేళ్లు రిలేషన్‌లో ఉన్నాం. ఒకరికొకరం సరిపోతామని తెలుసుకున్నాం. అందుకే పెళ్లి చేసుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ వరుణ్ తేజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.