అభిమానులకు దసరా పండుగ కానుకగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తోన్న విశ్వంభర(Vishwambhara) చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. విజువల్ వండర్‌గా రూపొందించడంతో మెగా ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యారు. యువ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిష, అశిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా, జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా నటిస్తున్నారు.
మొదటగా సౌర కుటుంబాన్ని చూపిస్తూ అవతార్ లోని పక్షులు, భారీ వీఎఫ్ఎక్స్ సన్నివేశాలతో ట్రైలర్ స్టార్ అవుతుంది. అలాగే వరల్డ్ మిస్టరీ సీక్రెట్ అంటూ ప్రశ్నలు పుట్టించిన కాలమే సంధానం చెబుతుందని బ్యాగ్రౌండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది.
టీజర్ లో చిరు డైలాగ్స్ లేకపోయినప్పటికీ ఫైట్స్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బిజియంతో అలరించారు. మొత్తానికి దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మెగాస్టార్ ఎంట్రీ రెక్కల గుర్రం మీద అయితే దాని తాలూకా గ్రాఫిక్స్ మంచి నాచురల్ గా కనిపిస్తున్నాయి. అలాగే భూమి మీద ఉండే చిరు పాత్ర ఒక బలమైన కారణంతో మరో లోకం లోకి వెళ్లినట్టుగా కనిపిస్తుంది. అలాగే అక్కడ వింత వింత జంతువులు, కొన్ని తెగల మనుషులు చూస్తే వశిష్ట విజన్ కనిపిస్తుంది. అలాగే కీరవాణి స్కోర్ కూడా ఇందులో బాగుంది. ఇలా ఈ సినిమా టీజర్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి.