రష్మిక మందన్న గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2 ది రూల్’ లో నటిస్తోంది. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, తమిళం వంటి భాషా చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో స్టార్‌గా రాణిస్తునే బాలీవుడ్‌లోను అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’ మూవీలో నటించి అలరించింది. ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటోంది. కాగా రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం రష్మిక మందన్నను ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. పుష్ప సినిమాలో రష్మిక మందన్నా డి గ్లామరస్ లుక్‌లో కనిపిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి మేకప్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డారట పుష్ప టీం. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా షూటింగ్ టైం లో రష్మిక మందన్నా సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేక పోయిందట. బాడీ అంతా అలా బ్లాక్ కలర్ మేకప్ చేయడంతో లంచ్ బ్రేక్‌లో లిప్స్ వరకే అలా క్లీన్ చేసుకుని జూస్ మాత్రమే తీసుకుందట. ఆ మేకప్ రిమూవ్ చేసేటప్పుడు చాలా చాలా నొప్పి వేసేదట. అయితే ఆ టైంలో రష్మిక మందన్నా ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. “ఇలాంటి నొప్పులు భరిస్తేనే ఇండస్ట్రీలో హీరోయిన్ కాగలరు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె గతంలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు.. రష్మిక చెప్పింది నిజమే.. హీరోయిన్ అవ్వడం మామూలు విషయం కాదు. చాలా నొప్పులు భరించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.