నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ భారీ కలెక్షన్లను సాధిస్తూ సంచలన విజయం సాధిస్తోంది. ఈ సందర్భంగా ఒక ఆంగ్ల మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో హీరో నాని, కల్కి 2898 A.D. సినిమాలో తాను ఉన్నారో లేదో స్పష్టం చేశారు.
‘కల్కి 2898 A.D. సీక్వెల్‌లో మీరు కృష్ణుడిగా కనిపిస్తారా? ఆ అవకాశం ఉందా?’ అని అడిగిన ప్రశ్నకు నాని ఆసక్తికరంగా స్పందించారు. “అస్సలు లేదు. సెకండ్ పార్ట్‌లో కృష్ణుడి పాత్ర కన్నా అర్జునుడు, కర్ణుడి పాత్రలే ఎంతో కీలకం. ఈ సీక్వెల్‌లో కృష్ణుడి ముఖాన్ని చూపించనని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇదివరకే చెప్పారు. నేను రెండో భాగంలో ఉన్నట్లు రూమర్లు ఎలా ప్రారంభమయ్యాయో నాకు తెలియదు. బహుశా నేను కల్కి టీమ్‌తో ఎక్కువ సార్లు కనిపించడమే ఇందుకు కారణం. కానీ ఇందులో గెస్ట్ రోల్ చేయడంపై నాతో ఇప్పటి వరకు ఎవరూ చర్చించలేదు. నేను ఏ చిత్రంలోనూ గెస్ట్ రోల్స్ చేయలేను. కానీ కల్కి టీమ్‌తో కలిసి పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను” అని నాని స్పష్టంచేశారు.