టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా, విలన్‌గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘బాహుబలి’తో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాకుండా, రానా ‘నంబర్ వన్ యారీ’ అనే టాక్ షోను విజయవంతంగా హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం రానా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇటీవల నివేదా థామస్ హీరోయిన్‌గా నటించిన ’35 చిన్న కథ కాదు’ సినిమాను రానా నిర్మించాడు, ఈ చిత్రం సెప్టెంబర్ 6న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
తాజాగా, రానా మరో కొత్త టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ షో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌కి రానుందట. ఈ టాక్ షో కోసం రానా కొంతమంది ప్రముఖ సినీ సెలబ్రిటీలను గెస్ట్‌లుగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. వారిలో నాగచైతన్య, శోభిత, శ్రీలీల, బాలకృష్ణ, కరణ్ జోహార్, సిద్దు జొన్నలగడ్డ ఉన్నారని తెలుస్తోంది.
ఇందులో నాగచైతన్య, శోభితల లవ్ స్టోరీ గురించి కూడా బయటపడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియనప్పటికీ, అక్కినేని అభిమానులు ఈ షోపై ఆసక్తిగా ఉన్నారు మరియు అధికారిక ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.