కమల్ హాసన్ (Kamal Haasan) 70వ బర్త్‌డే సందర్భంగా.. సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖలు, అభిమానులు నెట్టింట పోస్టులతో సందడి చేస్తున్నారు. అంతే కాకుండా.. ఆయన పుట్టినరోజు సందర్భంగా.. కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ (Thug Life) నుంచి టీజర్ (teaser) కూడా విడుదల చేశారు. పాన్ ఇండియా (Pan India) లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ (June) 5న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. ఆయన బర్త్‌డే (birthday) స్పెషల్‌గా కూతురు శృతి హాసన్ తన ఇన్‌స్టా (Insta) వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ (Special Post) పెట్టింది.
‘పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా.. మీరు ఒక అరుదైన డైమండ్ (diamond). మీ కూతురుగా పుట్టడం నా అదృష్టం. అలాగే మీ పక్కన నడవడం నా జీవితంలో నాకు ఇష్టమైన వాటిలో ఒకటి. మీరు దేవుడిని నమ్మరని నాకు తెలుసు. కానీ మీపై ఎల్లప్పుడూ అతని/ఆమె ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే ఎల్లప్పుడూ చాలా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటూ ఇంకా మరెన్నో అద్భుతాలు సృష్టిస్తుండాలి. మరెన్నో పుట్టిన రోజులు అండ్ వేడుకలు జరుపుకోవాలి. మీ కలలు అన్నీ నిజమవ్వాలి.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నాన్న’ అంటూ విషెస్ తెలిపింది.