పక్కవాళ్లకు స్వీట్ ఇవ్వకుండా తింటే కూడా పాపమే? గరుడ పురాణంలో ఘోరమైన శిక్ష?
హిందూ ధర్మంలో గరుడ పురాణానికి చాలా ప్రాశస్త్యం ఉంది. దీనికి మహాపురాణ్ అని పేరు. ఈ గ్రంథం చెడు పనులను విడిచిపెట్టి మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుత్మంతుడి సందేహాలు తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలే గరుడపురాణం. ఇందులో భాగంగా మీరు చేసే పాపం ఆధారంగా వచ్చే జన్మలో ఎలా పుడతారో చూసుకోండి.
పాపం-వచ్చే జన్మలో పుట్టుక
ఎవ్వరికీ పెట్టకుండా స్వీట్స్ తినేవాడు- గరళగండ రోగ జన్మ పొందుతాడు
గోహత్య – మరగుజ్జు వాడుగా పుడతాడు
కన్యాహత్య – కుష్టు రోగిగా జన్మిస్తాడు
స్త్రీ హత్య, గర్భ పాతం – నిత్య రోగ బాధ
స్వగోత్ర స్త్రీ సంబంధం – నపుంసక జన్మ
గురుభార్యతో అక్రమ సంబంధం – దుష్కర్మం గల జన్మ
మాంసం భక్షణ చేసే బ్రాహ్మణుడు – అతిరక్ష అనే కుష్టు వ్యాధి
శ్రార్ధంలో అశుచి ఆహారం పెట్టేవాడు – చిత్రకుష్టువు రోగి జన్మ
గురువుని అవమానించిన వాడు – అపస్మార రోగి జన్మ
వేద శాస్త్రాలని నిందించేవాడు – పాండురోగి జన్మ
అబద్ధపు సాక్ష్యం చెప్పేవాడు – మూగవాడి జన్మ
ఏకపంక్తి లో తేడాగా భోజనం పెడితే – ఒక కన్ను లేనివాడిగా పుడతాడు
పెళ్లి చెడగొట్టే వాడు – పెదవుల్లేని జన్మ పొందుతాడు
పుస్తకం దొంగతనం చేస్తే- అంధుడై పుడతాడు
గో-బ్రహ్మణులని కాలితో తన్నేవాడు – కుంటి వాడై పుడతాడు
అబద్ధాలు చెప్పేవాడు – స్పష్టమైన వాక్కు లేని జన్మ
అబద్ధాలు వినేవాడు – చెవిటివాడిగా పుడతారు
విషం పెట్టేవాడు – ఉన్మత్త జన్మ పొందుతాడు
ఇళ్ళు తగలేబెట్టే వాడు – బట్టతలతో బాధపడతాడు
బంగారం దొంగలించే వాడు – పుప్పి గోళ్ళతో జన్మిస్తాడు
లోహాలు దొంగలించే వాడు – నిర్ధనుడిగా జన్మిస్తారు
అన్నం దొంగలించే వాడు – ఎలుకలా పుడతారు
ధాన్యం దొంగలించే వాడు – మిడత జన్మెత్తుతారు
నీళ్లు దొంగలించే వాడు – చాతకపక్షిలా జన్మిస్తారు
కూరలు,ఆకులు దొంగలించే వాడు – నెమలి జన్మ
తేనె అపహరించేవాడు – దోమగా జన్మిస్తాడు
మాంసం అపహరించే వాడు – గ్రద్ద గా జన్మిస్తాడు
ఆత్మ హత్య చేసుకుంటే – కొండ మీద నల్ల త్రాచుగా పుడతాడు
ఇవన్నీ పుస్తకాల్లో ప్రస్తావించినవి, పండితులు చెప్పిన వివరాలు, వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.