|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుసు క‌దా, డ్యూడ్ సినిమాల ఓటీటీ తేదీలు ఫిక్స్‌..ఎప్పుడంటే ?

Published: 03-11-2025, 10:39 PM
తెలుసు క‌దా, డ్యూడ్ సినిమాల ఓటీటీ తేదీలు ఫిక్స్‌..ఎప్పుడంటే ?

దీపావళి సందర్భంగా విడుదలైన పలు చిత్రాల ఓటీటీ విడుదల తేదీలు ఖరారయ్యాయి. సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ నవంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ నవంబర్ 14న, రవితేజ ‘మాస్ జాతర’ డిసెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నాయి. ఈ లేటెస్ట్ అప్‌డేట్స్‌పై ఓ లుక్కేద్దాం.

Key Points

1

సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' నవంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

2

ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

4

రవితేజ 'మాస్ జాతర' డిసెంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

తెలుసు కదా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

దిశ‌, వెబ్ డెస్క్ : మొన్న దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ లిస్టులో హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా సినిమా కూడా ఉంది. రాశి ఖ‌న్నా, శ్రీనిధి శెట్టి, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఈనెల 7వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుసు కదా సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.

అలాగే ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కూడా ఈ నెల 14వ తేదీ అంటే వచ్చే వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మూవీ నెట్ ఫిక్స్ లోనే రాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రెండు రోజుల కిందట రిలీజ్ అయిన రవితేజ మాస్ జాతర కూడా నెట్ ఫ్లిక్స్‌ లోనే రిలీజ్ కానుంది. ఈ మూవీ డిసెంబ‌ర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ క‌నిపిస్తోంది.

డ్యూడ్ సినిమా బ్లాక్‌బస్టర్ ఓటీటీ ఎంట్రీ

రవితేజ మాస్ జాతర ఓటీటీ డేట్

మొత్తంగా, దీపావళి సందడి తర్వాత ప్రేక్షకులు తమ అభిమాన చిత్రాలను ఇంటి వద్ద నుంచే ఓటీటీలో ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’, ‘మాస్ జాతర’ సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ద్వారా త్వరలో అందుబాటులోకి రావడం సినీ ప్రియులకు ఆనందకర వార్త.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.