
టాలీవుడ్‌లో విషాదం, పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మరణం సినీ వర్గాలను కలచివేసింది. ఈ బాధాకరమైన వార్త మధ్య, ‘OG 2’ టీమ్, సంగీత దర్శకుడు థమన్ తీసుకున్న నిర్ణయం అభిమానుల హృదయాలను కదిలిస్తోంది. పవర్ స్టార్ అభిమానికి అపూర్వ నివాళి!
Key Points
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతితో టాలీవుడ్ లో విషాదం.
'OG 2' ఆల్బమ్‌ను నిరంజన్‌కు అంకితం చేస్తామని థమన్ ప్రకటన.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 'OG 2' టీం.
నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని థమన్ ఎమోషనల్ పోస్ట్.
థమన్ ఎమోషనల్ పోస్ట్: ‘OG 2’ ఆల్బమ్ ఎవరికి?
హనుమకొండకు చెందిన నిరంజన్ అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని కన్నుమూశాడు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన నిరంజన్.. పరిస్థితి విషమించటంతో తుదిశ్వాస విడిచాడు. తన డైహార్డ్ ఫ్యాన్ ఇక లేరన్న విషయం తెలియడంతో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. నిరంజన్‌ను కలిసిన క్షణాలు ఇంకా తన మదిలో ఉన్నాయని.. ఈలోపే ఇలా జరగడం తనను తీవ్రంగా కలిచివేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా నిరంజన్ మృతికి సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే స్వయంగా హనుమకొండ వెళ్లి నిరంజన్ ను పరామర్శించారు. తనను కలవాలనే అభిమాని చివరి కోరిక తీర్చారు. ఆ సమయంలో ‘OG 2’ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ ఇస్తానని అభిమానికి పవన్ మాటిచ్చారు . ”మనిద్దరం కలిసి ‘ఓజీ’ సినిమా చూద్దాం. నేను ‘ఓజీ 2’ చేస్తే దాంట్లో నువ్వే స్పెషల్ గెస్ట్. నిన్ను కచ్చితంగా మళ్లీ పిలిపిస్తాను. ఇంకోసారి నీకోసం వస్తాను. నువ్వు అడిగింది చేస్తాను” అని పవన్ అన్నారు. అయితే ఇంతలోనే నిరంజన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పవన్ మాటిచ్చినట్లుగా, తమ ఆల్బమ్‌ను నిరంజన్ కు అంకితం చేస్తామని థమన్ ప్రకటించారు. నిరంజన్ ఆత్మకి శాంతి చేకూరాలి కోరుకుంటూ థమన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టారు. ”తన జీవితంలో కొనసాగుతున్న బాధల మధ్య, ఈ రోజున ఆయన ఎంత సంతోషంగా ఉండేవారో. డియర్ నిరంజన్.. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. మన లీడర్ చెప్పినట్లుగానే, మా ఆల్బమ్‌ను నీకు అంకితం చేస్తాము” అని థమన్ పేర్కొన్నారు. ఇది నిరంజన్ కి పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ టీమ్ తరపున ఘన నివాళి అవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. Thaman Insta Story మరోవైపు నిరంజన్ మరణంపై పవన్ కళ్యాణ్ ఎక్స్ లో ఎమోషనల్ నోట్ పోస్ట్ పెట్టారు . ”నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది” ”అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన నిరంజన్.. నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని పవన్ రాసుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట.. నిరంజన్ కి ఘన నివాళి!
పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది గుండె కోత!
నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ‘OG 2’ టీమ్ ఇచ్చిన ఈ గొప్ప గౌరవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమా అప్‌డేట్స్, మరిన్ని ఆసక్తికర వార్తల కోసం వేచి ఉండండి!


