
టాలీవుడ్ నటుడు నితిన్ నటించిన ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్ లోని “మాట పోయి మనిషి బ్రతికినా…” అనే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది. జూలై 4న విడుదల కానున్న ఈ చిత్రం
Key Points
నితిన్ నటించిన ‘తమ్ముడు’ ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్‌లోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
‘తమ్ముడు’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ఇటీవల ‘రాబిన్‌హుడ్’ (Robinhood)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోయింది. ఇక ఈ సారి ఎలాగైనా హిట్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హిట్ సినిమా టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘తమ్ముడు’ (thammudu) పేరుతో రాబోతున్న ఈ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇందులో సప్తమి గౌడ(Sapthami Gowda), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) హీరోయిన్లుగా నటిస్తుండగా.. లయ కీలక పాత్రలో కనిపించనుంది.
అయితే ఈ సినిమాను svc బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 4న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో ‘‘మాట పోయి మనిషి బ్రతికినా మనిషి పోయినట్టే లెక్క… మాట బ్రతికి మనిషి పోతే మనిషి బతికున్నట్టే లెక్క’’ అని నితిన్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అంచనాలు పెంచేస్తున్నాయి. కాగా, ఈ సినిమాతో పాటు నితిన్ వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ మూవీ కూడా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
నితిన్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?
సినిమాపై అంచనాలు
‘తమ్ముడు’ ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూలై 4న విడుదలయ్యే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


