|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ది 100 రివ్యూ.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ పోలీస్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Published: 11-07-2025, 12:40 AM
ది 100 రివ్యూ.. మొగలి రేకులు హీరో ఆర్కే సాగర్ పోలీస్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

బుల్లితెర నటుడు ఆర్కే సాగర్ ‘ది 100’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కు తిరిగి వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటన ఎలా ఉందో, సినిమా కథ ఎలా సాగుతుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

Key Points

1

ఆర్కే సాగర్ పోలీస్‌గా తన కమ్‌బ్యాక్‌తో ప్రేక్షకులను అలరించాడా?

2

ది 100 సినిమా క్రైమ్ థ్రిల్లర్‌గా ఎంత విజయవంతమైంది?

4

విష్ణుప్రియ, మిషా నారంగ్ పాత్రలు సినిమాకు ఎలాంటి వెలుగునిచ్చాయి?

కథాంశం మరియు నటన

నటీనటులు: ఆర్కే సాగర్, విష్ణుప్రియ, మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ, ఆనంద్, తారక్ పొన్నప్ప, కల్యాణి నటరాజన్, వంశీ నెక్కంటి, వీవీ గిరిధర్, టెంపర్ వంశీ తదితరులు

దర్శకత్వం: రాఘవ్ ఓంకార్ శశిధర్

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కే నాయుడు

ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల

నిర్మాతలు: రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జె. తారక్ రామ్

క్రైమ్ థ్రిల్లర్‌గా ది 100 సినిమా విశ్లేషణ

విడుదల తేది: జూలై 11, 2025

మొగలి రేకులు సీరియల్‌తో బుల్లితెర హీరో గా పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు పాత్రలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఆర్కే సాగర్. సినిమాల్లోనూ హీరోగా అలరించిన ఆర్కే సాగర్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఆర్కే సాగర్ కమ్‌బ్యాక్ రీ ఎంట్రీ ఇచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100 .

పవన్ కల్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసిన ది 100 సినిమా ఇవాళ (జులై 11) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, మరోసారి పోలీస్‌గా ఆర్కే సాగర్ ఎలా మెప్పించాడు అనే విషయాలను నేటి ది 100 రివ్యూ లో తెలుసుకుందాం.

అప్పుడే ఐపీఎస్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న విక్రాంత్‌ (ఆర్కే సాగర్‌) నగరంలో ఏసీపీగా బాధ్యతలు చేపడుతాడు. అప్పుడు సిటీలో జరుగుతున్న రాబరీ గ్యాంగ్‌ హత్య కేసుపై దృష్టి సారిస్తాడు విక్రాంత్. తనదైన స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ చేసిన విక్రాంత్ హత్యలు ఎవరో చేశారో తెలుసుకుంటాడు. కానీ, ఇంతలోనే హత్యలు చేసినవాళ్లు కాకుండా ఓ పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది.

హత్యలు జరిగిన అమ్మాయిలకు ఏమైంది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన మధు ( విష్ణుప్రియ ) ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఈ ఇన్వెస్టిగేషన్‌లో తన ప్రియురాలు ఆర్తి (మిషా నారంగ్) గురించి విక్రాంత్ తెలుసుకున్నది ఏంటీ? అసలు ఈ కేసులో నేరస్థులు ఎవరు? బిజనెస్‌మ్యాన్ వల్లభ (తారక్ పొన్నప్ప) పాత్ర ఏంటీ? ఫైనల్‌గా ఆ కేసును విక్రాంత్ ఎలా పరిష్కరించాడు? అనే థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే ది 100 సినిమా చూడాల్సిందే.

చివరి తీర్పు

దాదాపుగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ ఒకే స్టోరీతో ఉంటాయి. ఓ క్రైమ్, విలన్‌కు ఓ నేపథ్యం, అతన్ని పట్టుకునేందుకు హీరో చేసే అడ్వెంచర్, ఇన్వెస్టిగేషన్ వంటి సీన్లను ఎంత థ్రిల్లింగ్‌గా మలిస్తే అంత హిట్ అవుతుంది ఆ సినిమా. ఈ విషయంలో ది 100 డైరెక్టర్ దాదాపుగా సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు.

సూసైడ్ సీన్‌తో ప్రారంభం అయిన ఈ సినిమా అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ ముగుస్తుంది. హంతకులు దొరికిన అసలు క్రైమ్ మరోటి ఉందనే విషయం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఎమోషనల్‌గా ప్రారంభమవుతుంది. ఒకానొక సమయంలో క్లైమాక్స్ ఎలా ఉంటుందో ముందే ఊహించేలా సీన్స్ ఉంటాయి. దాంతో అప్పటివరకు వచ్చే సన్నివేశాలు కాస్తా బోరింగ్‌గా అనిపిస్తాయి.

కానీ, క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఒక మంచి సందేశం ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం బాగుంది. డైరెక్టర్ టేకింగ్ పర్వాలేదని చెప్పొచ్చు. ఇక మరోసారి పోలీస్‌గా ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు అదరగొట్టాడు.

మొగలి రేకులు సీరియల్‌లో పోలీస్‌గా పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన ఆర్కే సాగర్ మరోసారి అలాంటి పాత్రతో మెప్పించారు. మంచి ఈజ్‌తో పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. ఇక మిషా నారంగ్ తన పాత్రకు చక్కటి న్యాయం చేశారు. విష్ణుప్రియ, ధన్య బాలకృష్ణ ఆకట్టుకున్నారు. విలన్‌గా తారక్ పొన్నప్ప అలరించారు.

మిగతా పాత్రధారులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే ఆర్కే సాగర్ పోలీస్‌గా కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది 100పై ఓ లుక్కేయొచ్చు.

మొత్తం మీద, ‘ది 100’ సినిమా క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులను మెప్పించే అంశాలను కలిగి ఉంది. ఆర్కే సాగర్ నటన, కథలోని ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.