|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజీవ్ గాంధీ హత్యపై ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయిన ట్రైలర్.. హంతకులను ఎలా పట్టుకున్నారంటే?

Published: 18-06-2025, 9:49 AM
రాజీవ్ గాంధీ హత్యపై ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అదిరిపోయిన ట్రైలర్.. హంతకులను ఎలా పట్టుకున్నారంటే?

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుపై ది హంట్ అనే వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారో ఈ సిరీస్ చూపిస్తుంది.

Key Points

1

రాజీవ్ గాంధీ హత్య రహస్యాలను వెల్లడిస్తున్న 'ది హంట్' వెబ్ సిరీస్

2

90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారో చూపించనున్న థ్రిల్లర్

4

నగేష్ కుకునూర్ దర్శకత్వంలో అదిరిపోయే ట్రైలర్ విడుదల

ది హంట్ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య గురించి తెలుసు కదా. సుమారు 35 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో దర్యాప్తు సాగిన తీరు, 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారన్న దానిపై ది హంట్ పేరుతో వెబ్ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ ట్రైలర్ ను బుధవారం (జూన్ 18) మేకర్స్ రిలీజ్ చేశారు.

దేశాన్ని షాక్‌కు గురి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తుపై ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ (The Hunt: The Rajeev Gandhi Assassination Case) పేరుతో వెబ్ సిరీస్ వస్తోంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో ఈ సిరీస్ జులై 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని బుధవారం (జూన్ 18) ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది.

90 రోజుల్లో హంతకులను ఎలా పట్టుకున్నారు?

“దేశాన్ని కంపింపజేసిన హత్య. ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేసిన హంతకుల వేట. ది హంట్ : ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ జులై 4 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్రైలర్ రిలీజ్ చేసింది.

ది హంట్ వెబ్ సిరీస్ ట్రైలర్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ ట్రైలర్ మొదట్లోనే శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఇండియన్ హైకమిషన్ కు ఓ వ్యక్తి ఫోన్ చేస్తాడు. రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా అంటూ ఆ వ్యక్తి అడుగుతారు. ఆ తర్వాత మానవబాంబు సిద్ధమవుతుండటం చూపిస్తారు. ఆ వెంటనే మాజీ ప్రధాని రాజీవ్ హత్యకు గురైనట్లు చెప్పే వార్తను చూడొచ్చు. ఈ హత్య కేసును అత్యంత తీవ్రంగా పరిగణించే ప్రభుత్వం వెంటనే దర్యాప్తుకు ఆదేశిస్తుంది.

నగేష్ కుకునూర్ దర్శకత్వం

ఇది ఎల్టీటీఈ పనా లేక స్వదేశంలోనే ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అన్న చర్చ జరుగుతుంది. సీఆర్పీఎఫ్ ఐజీపీ కార్తికేయన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను ఏర్పాటు చేస్తారు. మొదట శ్రీలంకన్ తమిళులతో దర్యాప్తు మొదలుపెడతారు. కేవలం 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారన్నది ఈ ది హంట్ వెబ్ సిరీస్ లో దర్శకుడు నగేష్ కుకునూర్ చూపించబోతున్నాడు.

హైదరాబాద్ కు చెందిన నగేష్ కుకునూర్ ఎప్పుడో 1998లో హైదరాబాద్ బ్లూస్ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ మధ్యే సిటీ ఆఫ్ డ్రీమ్స్, మోడర్న్ లవ్ హైదరాబాద్ పేరుతో రెండు వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య, దర్యాప్తు తీరుపై సిరీస్ రూపొందించాడు. మరి ఈ కొత్త సిరీస్ ఎలా ఉండనుందో జులై 4న తెలుస్తుంది. సోనీ లివ్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

‘ది హంట్’ వెబ్ సిరీస్ రాజీవ్ గాంధీ హత్య రహస్యాన్ని, దర్యాప్తును ఉత్కంఠగా చూపిస్తుందని ట్రైలర్ సూచిస్తోంది. జులై 4న సోనీ లివ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.