|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ‘ప్యారడైజ్’ సునామీ: ‘ఆయా షేర్’తో ప్రపంచాన్ని ఊపేస్తున్న తెలుగు పాట!

Published: 26-02-2026, 9:35 PM
  • నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘ది ప్యారడైజ్’ చిత్రం రానుంది.
  • ‘ఆయా షేర్’ పాట 9 దేశాల మ్యూజిక్ చార్టుల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
  • ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు, ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
  • ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం విడుదల కాకముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ పాట గ్లోబల్ యాంథమ్‌గా మారి, 9 దేశాల మ్యూజిక్ చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది.

‘ఆయా షేర్’: గ్లోబల్ యాంథమ్‌గా ట్రెండింగ్

The Paradise: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher Song) కేవలం ఒక పాటగా కాకుండా, ఒక గ్లోబల్ యాంథమ్‌గా మారిపోయింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తన మార్క్ బిజీఎంతో అందించిన ఈ సాంగ్, విడుదలైన కొద్దిసేపటికే యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. వాస్తవానికి ఈ సాంగ్ అనిరుధ్ కంపోజ్ చేసిన ‘కణ్మనీ రాంబో ఖతీజా’ చిత్రంలో ‘డిప్పమ్ డప్పమ్’ ట్యూర్ అయినప్పటికీ, ఆ సినిమాకు వర్కవుట్ కాకపోవడంతో, ఈ సినిమాకు ఆ ట్యూన్‌ని వాడేశాడు అనిరుధ్. ఇప్పుడు మాత్రం బీభత్సంగా ఈ పాట ఆకర్షిస్తోంది. ముఖ్యంగా భారత్, యూఏఈ దేశాల్లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. తెలుగు సినిమా పాట ఈ స్థాయిలో అంతర్జాతీయ వేదికలపై ట్రెండ్ అవ్వడం చూస్తుంటే, నాని గ్లోబల్ మార్కెట్‌పై గట్టిగానే కన్నేశారని అర్థమవుతోంది.

9 దేశాల్లో నెంబర్ 1: తెలుగు సినిమా సత్తా చాటిన పాట

ఈ పాట కేవలం ఆసియా ఖండానికే పరిమితం కాకుండా.. యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, సౌదీ అరేబియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి 9 దేశాల్లో టాప్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఈ రేంజ్ అంతర్జాతీయ ఆదరణ పొందడం మరోసారి టాలీవుడ్ సత్తాను చాటి చెబుతోంది. ఈ సాంగ్‌లో అనిరుధ్ అందించిన రా ఎనర్జీకి తోడు, నాని తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టేశారు. ముఖ్యంగా అందులోని ఐకానిక్ హుక్ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘ఫ్లోర్ మూవ్’ స్టెప్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో వైరల్ అవుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అభిమానులు ఈ డ్యాన్స్ మూవ్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా రీల్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్: నాని స్టెప్పులకు ఫిదా!

ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబో కావడంతో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. ‘ఆయా షేర్’ సాంగ్ సృష్టించిన ఈ భారీ విజయం ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌కు అదిరిపోయే కిక్ ఇచ్చింది. సినిమా ఇంకా విడుదల కాకముందే సరిహద్దులు దాటి ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఈ క్రేజ్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద నాని మరో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లిన ఈ పాటతో, ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతగానో వేచి చూస్తున్నారు. ఆగస్ట్ 21న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

‘ది ప్యారడైజ్’ చిత్రం ‘దసరా’ వంటి విజయం తర్వాత వస్తుండటంతో అంచనాలు పెరిగాయి. ‘ఆయా షేర్’ పాట సృష్టించిన ఉత్సాహం సినిమాకు మరింత బూస్ట్ ఇవ్వనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.