
ప్రభాస్ మరియు మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. సినిమా టీజర్ జూన్ 16న విడుదల కానుండగా, లీక్ అయినట్లు వచ్చిన వార్తలపై చిత్ర బృందం స్పందించింది.
Key Points
ప్రభాస్, మారుతి కాంబోలో 'ది రాజాసాబ్' సినిమా డిసెంబర్ 5న విడుదల.
సినిమా టీజర్ జూన్ 16న విడుదల కానుంది.
టీజర్ లీక్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
చిత్ర బృందం టీజర్ లీక్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ది రాజాసాబ్ టీజర్ విడుదల తేదీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి (Maruthi) కాంబోలో వస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ (The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ రొమాంటిక్, హారర్ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ జూన్ 16న విడుదల కాబోతున్నట్లు రీసెంట్‌గా చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. టీజర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.
టీజర్ లీక్ వార్తలు
తాజాగా, ఈ విషయంపై మూవీ టీమ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ది రాజాసాబ్ కంటెంట్ ఎవరి సోషల్ మీడియాలోనైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే అకౌంట్ సస్పెండ్ చేస్తాం. అందరూ మాకు సహకరిస్తారని అనుకుంటున్నాం. మాతో నిలబడాలని మేము అభ్యర్థిస్తున్నాము. బాధ్యతాయుతంగా జరుపుకుందాం. జాగ్రత్తగా ఉండండి’ అని హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టారు. అలాగే టీజర్(Teaser)పై మరోసారి అప్డేట్ ఇస్తూ.. ‘ఇప్పుడు అందరూ నవ్వుతున్నారు… కానీ రాబోయేది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది.. ది రాజాసాబ్ సెట్స్ నుండి వర్కింగ్ స్టిల్ ఇదిగో.. టీజర్ జూన్ 16న ఉదయం 10:52 గంటలకు రాబోతుంది.. రెడీగా ఉండండి’ అని సెట్స్ నుంచి ఓ ఫొటో షేర్ చేసుకున్నారు.
చిత్ర బృందం హెచ్చరిక
All smiles now… 😍 but what’s coming will send shivers down your spine 🔥 Here’s a working still from #TheRajaSaab sets ❤️ #TheRajaSaabTeaser on June 16th at 10:52AM 💥 #TheRajaSaabOnDec5th pic.twitter.com/WtHvEBV83Z
చివరగా, ది రాజాసాబ్ సినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, అభిమానుల ఆసక్తి మరింత పెరుగుతోంది.


