|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ది రాజా సాబ్‌’ ట్రైలర్‌.. ప్రభాస్‌ పోస్ట్‌ వైరల్‌

Published: 28-09-2025, 12:45 AM

ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్‌’ చిత్రం ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో జోష్ పెరిగింది.

Key Points

1

'ది రాజా సాబ్‌' రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రంగా రూపొందుతోంది.

2

ట్రైలర్ సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది.

4

సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ట్రైలర్ విడుదల తేదీ, సమయం

కల్కి సినిమా తర్వాత ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం  ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ చిత్రం కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ గురించి ప్రకటన చేశారు. ప్రభాస్‌ రాయల్‌ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నవారందరికీ శుభవార్త అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌లో కనిపించారంటూ ప్రశంసలు దక్కాయి.

సినిమా విశేషాలు, ప్రధాన నటీనటులు

‘ది రాజా సాబ్‌’ (The Raja Saab) ట్రైలర్‌ సెప్టెంబర్‌ 29న సాయింత్రం ఆరు గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రభాస్‌ కూడా ప్రకటించారు. ఒక అభిమానిగా నా హీరోని ఎలా చూడాలనుకున్నానో ఆ విధంగానే ప్రభాస్‌ను చూపించానని మారుతి అన్నారు. దీంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌లో ఫుల్‌ జోష్‌ పెరిగింది. ఈ మూవీలో వచ్చే 40 నిమిషాల క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుందని కూడా దర్శకుడు చెప్పారు.  ఈ చిత్రం సుమారు 3గంటల పాటు రన్‌ టైమ్‌ ఉంటుందన్నారు.

దర్శకుడు మారుతి అంచనాలు

దర్శకుడు మారుతి. ప్రభాస్‌ తొలిసారి ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీతో టీజీ విశ్వప్రసాద్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది.

‘ది రాజా సాబ్‌’ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ప్రకటన పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 5న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింత పెరగడం ఖాయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.