|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాజాసాబ్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త! థియేటర్లలో ఇక పండగే!!

Published: 10-01-2026, 4:00 AM
రాజాసాబ్: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త! థియేటర్లలో ఇక పండగే!!
  • ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా జనవరి 9న విడుదలైంది.
  • సినిమాలో ప్రభాస్ ముసలి పాత్ర సన్నివేశాలు లేవని ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • కొన్ని అదనపు సన్నివేశాలను రేపటి నుండి థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
  • ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.

ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నారు. అభిమానుల కోరిక మేరకు మరిన్ని సన్నివేశాలు జత చేసి రేపు థియేటర్లలో విడుదల చేయనున్నారు.

విడుదలైన ‘ది రాజాసాబ్’ సినిమా

The RajaSaab:సంక్రాంతి వస్తోందంటే చాలు సినీ ప్రియులకు పెద్ద పండుగే.. ముఖ్యంగా స్టార్ హీరోలు సైతం తమ సినిమాలతో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతారు. అలా జనవరి 9వ తేదీన పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అయింది. అయితే ఈ సినిమా పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ యాక్టింగ్ పరంగా న్యాయం చేసినా.. డైరెక్టర్ మారుతి సినిమాని హ్యాండిల్ చేయలేకపోయారనే వార్తలు వినిపించాయి. దీంతో చాలాచోట్ల ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చేసింది.

మరోవైపు సినిమా చూసిన వారు.. ట్రైలర్లో ప్రభాస్ ముసలి పాత్రలో కనిపించిన సీన్స్ సినిమాలో చూపించలేదని అసహనం వ్యక్తం చేశారు.అయితే ఇప్పుడు తాజాగా రాజాసాబ్ సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలా యాడ్ చేసిన సన్నివేశాలను రేపటి నుంచి థియేటర్లో చూపించనున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ముసలి పాత్రలో కనిపించే సన్నివేశాలను యాడ్ చేయబోతున్నారట. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారింది.

ఇప్పటికే సినిమా నిడివి ఎక్కువగా ఉందని అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఇటువంటి తరుణంలో సినిమాలో మరిన్ని సీన్స్ యాడ్ చేయడంపై ఆడియన్స్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. మరోవైపు ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నెగిటివ్ టాక్ రావడంతోనే చాలామంది థియేటర్ కు వెళ్లడానికి ఆసక్తి కనబరచడం లేదు. కనీసం ఇప్పటికైనా యాడ్ చేసిన సన్నివేశాల కోసమైనా ఆడియన్స్ థియేటర్ కి వెళ్తారేమో చూడాలి..

ముసలి పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రేక్షకులు

ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇనయా సుల్తానా, అమ్ము అభిరామి, ఆనంది, జరీనా వహాబ్ వంటి మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు స్నేహితుల పాత్రలో ఇందులో నటించారు. పైగా మొదటిసారి ప్రభాస్ నటించిన ఈ హర్రర్ కామెడీ జోనర్ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకున్నా..అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారని సమాచారం.

మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగారూ .90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ.. అఫీషియల్ గా చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. ఏదేమైనా ఎన్నో అంచనాల మధ్య ప్రభాస్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.

కొత్త సన్నివేశాలు జత చేస్తున్న మేకర్స్

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 2 కూడా ప్రకటించారు. ఇందులో ప్రభాస్ జోకర్ పాత్రలో కనిపించనున్నారు. దీనికి రాజాసాబ్ సర్కస్ 1935 అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మరి ఈ పార్ట్ 2 కి ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తారా లేక సీక్వెల్ గా వస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

https://twittr.com/MovieloverMegha/status/2009893592752603412?s=20

మొత్తానికి, ‘రాజాసాబ్’ సినిమా కొత్త సన్నివేశాలతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రభాస్ అభిమానులకు ఈ మార్పు ఏ మేరకు నచ్చుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.