|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సూడు సూడు సిత్తరాలు.. నట్టింట్లోకొచ్చె సినిమా హాలు.. ఆకట్టుకుంటోన్న ‘టీవీ వీడియో సాంగ్’

Published: 15-02-2026, 1:05 PM
  • కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ రిలీజ్ కు సిద్ధం!
  • హీరోగా సాయి తేజ్, హీరోయిన్ వేద జలంధర్ పరిచయంతో విలేజ్ డ్రామా!
  • ‘టీవీ వీడియో సాంగ్’ విడుదల: పల్లెటూరి ప్రజల టీవీ సందడి వైరల్!
  • సనరే సాహిత్యం: ‘సూడు సూడు సిత్తరాలు’ అంటూ ఆకట్టుకునే పాట!

కిరణ్ అబ్బవరం నిర్మాణంలో వస్తున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూవీలోని ‘టీవీ వీడియో సాంగ్’ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

టీవీ వీడియో సాంగ్‌తో పల్లెటూరి మెమొరీస్!

న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ పీరియాడిక్ డ్రామాతో వి. మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘టీవీ వీడియో సాంగ్’ రిలీజ్ చేశారు. టీవీ, డిష్ వచ్చిన కొత్తలో పల్లెటూరి ప్రజలు ఎంత ఆసక్తిగా ఆ ప్రసారాలు చూశారో ఈ పాటలో చిత్రీకరించారు. టీవీ ఇంటికి వచ్చిన రోజు ఆ ఇంటివారికే కాదు ఆ ఊరిలో టీవీ లేని వారందరికీ పండుగ రోజే. ఊరిలో మొదట టీవీ కొనడం మామూలు గొప్పకాదు, టీవీ ఉన్న ఇంటికి వెళ్లి మిగతా వారంతా సీరియల్స్, సినిమాలు చూసేవారు. ఈ సందడిని పాటలో తెలియజేస్తూ సనరే సాహిత్యాన్ని అందించారు. ‘టీవీ వీడియో సాంగ్’ ఎలా ఉందో చూస్తే.. ‘సూడు సూడు సిత్తరాలు, నట్టింట్లోకొచ్చె సినిమా హాలు, సూడు సూడు సీరియళ్లు, మరి చాలవంట రెండు కళ్లూ, ఎవడంటా మొట్టమొదట టీవీ తెచ్చింది, ఊరంతా మోతమోగాలా, తెరమీద చిందులకు మతిపోయిందంటూ, పడనోళ్ల గుండె పగిలి గుక్కె పట్టి ఏడ్చేయాల..’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్‌లో గ్రామీణ చిత్రం!

సాయి తేజ్, వేద జలంధర్ న్యూ లుక్ వైరల్!

ఇలాంటి ఆసక్తికరమైన సినిమా వార్తల కోసం చూస్తూ ఉండండి. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ మూవీ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి. త్వరలోనే మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.