
బ్లాక్ బస్టర్ హీరో తిరువీర్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇది హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.
Key Points
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో కొత్త చిత్రం అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు, గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.
కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు.
నవంబర్ 19 నుంచి షూటింగ్; తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో కొత్త సినిమా
లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్(Thiruveer) తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంతో భరత్ దర్శన్(Bharat Darshan) డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండటం విశేషం. ‘ప్రొడక్షన్ నంబర్-2’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుండగా.. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సినిమా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోందని సమాచారం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోందని టీమ్ తెలిపారు. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తుండగా.. ఈ నెల 19వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
పూజతో ప్రారంభమైన రెగ్యులర్ షూటింగ్
పాన్-ఇండియా విడుదల, సాంకేతిక నిపుణులు
ఈ నూతన చిత్రం ప్రేక్షకులందరికీ కొత్త అనుభూతిని అందించనుందని చిత్ర యూనిట్ తెలిపింది. నవంబర్ 19 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై, పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
