
మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన విష్ణు, తన సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. అతిథి నటులున్నప్పటికీ, ఈ శుక్రవారం తనదేనని విష్ణు ప్రకటించాడు.
Key Points
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా ఈ శుక్రవారం విడుదల.
అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ లాంటి స్టార్లతో పోటీపడేందుకు సిద్ధం.
ఈ శుక్రవారం తన సినిమా విజయం సాధిస్తుందని విష్ణు ధీమా.
'కన్నప్ప' డెవోషనల్ సినిమా కాబట్టే భారీ బడ్జెట్తో నిర్మించారు.
కన్నప్ప సినిమా విడుదల తేదీ
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో సమావేశంలో మంచు విష్ణు చిత్రయూనిట్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ రిపోర్టర్ ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, స్టార్ హీరో ప్రభాస్, మలయాల స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. వీరందరిలో మీ అస్థిత్వాన్ని ఎలా కాపాడుకుంటారని ప్రశ్నించారు.
దానికి విష్ణు సమాధానం ఇస్తూ ఈ శుక్రవారం తనదే అని విష్ణు చెప్పారు. శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం తనదే అని రేపు సినిమా చూసిన తరవాత మీతో మాట్లాడతానని అన్నారు. అతిరథ మహారథుల ముందు తాను కనిపించానా లేదా అనేది మీరే చూస్తారని అన్నారు. ఒక నటుడుగా తనకు ఇది పరీక్ష అని ఆ పరీక్షలో నెగ్గానో లేదో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా సినిమా కథను నమ్మే తాము ఇంత బడ్జెట్ పెట్టామని అన్నారు. కమర్షియల్ సినిమా అయితే ఇంత రిస్క్ చేసి ఉండేవాళ్లం కాదని డెవోషనల్ సినిమా కాబట్టే బడ్జెట్ పెట్టామని చెప్పారు.
మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
సినిమా ప్రమోషన్స్
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. శివుని ఆశీస్సులతో ఈ శుక్రవారం విజయం సాధిస్తానని ఆయన నమ్ముతున్నారు. సినిమా విజయం ఎలా ఉంటుందో చూడాలి.


