
📌 Key Points
- టాలీవుడ్ హీరో తిరువీర్ డిసెంబర్ 12న తండ్రయ్యాడు.
- కొడుకు చేతి ఫోటో షేర్ చేస్తూ ‘నాయినొచ్చిండు’ అని పోస్ట్ చేసి వైరల్ చేశాడు.
- ‘మసూద’ సినిమాతో తిరువీర్‌కు మంచి గుర్తింపు లభించింది.
- ఐశ్వర్య రాజేష్‌తో కలిసి ‘ఓ సుకుమారి’ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు.
టాలీవుడ్ నటుడు తిరువీర్ తండ్రి అయ్యారు. తన కొడుకుతో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు, అభిమానులు తిరువీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మసూద’ ఫేమ్ తిరువీర్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంతో బిజీగా ఉన్నారు.
తిరువీర్ తండ్రిగా ప్రమోషన్: పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరో తిరువీర్(Thiruveer) తండ్రి అయ్యాడు. ఆయన భార్య డిసెంబర్ 12న ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. తిరువీర్ ట్విట్టర్ ద్వారా ఓ ఫొటో షేర్ చేశాడు. ఇందులో తన కొడుకు చేతిని పట్టుకుని ఉండగా.. నాయినొచ్చిండు అనే క్యాప్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. గతేడాది కల్పన (kalpana)అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తిరువీర్ దంపతులు ఏడాదికే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తిరువీర్‌కు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. తిరువీర్ సినిమాల విషయానికొస్తే.. ‘మసూద’ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.
ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, పరేషాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో ప్రేక్షకులను అలరించినప్పటికీ హిట్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ సరసన నటించే చాన్స్ దక్కించుకుని ఫుల్ బిజీ అయిపోయాడు. ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కాంబోలో ‘ఓ సుకుమారి’ మూవీ రాబోతుంది. ఈ పాన్ ఇండియా సినిమాకు భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుండగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మసూదతో గుర్తింపు.. తిరువీర్ కెరీర్ గ్రాఫ్
ఐశ్వర్య రాజేష్‌తో ‘ఓ సుకుమారి’: పాన్ ఇండియా మూవీ
తండ్రిగా ప్రమోషన్ పొందిన తిరువీర్ వ్యక్తిగతంగా సంతోషంగా ఉండగా, వృత్తిపరంగా కూడా బిజీగా ఉన్నారు. ‘ఓ సుకుమారి’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తిరువీర్‌కు ఈ శుభవార్త కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.


