|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ హీరో.. చాలా ఎక్జైటింగ్‌గా ఉందంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Published: 08-07-2025, 3:54 AM
కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ హీరో.. చాలా ఎక్జైటింగ్‌గా ఉందంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర కన్నడ చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. కిచ్చా సుదీప్ నటించే ‘K-47’ చిత్రంలో ఆయన నటిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Key Points

1

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

2

కిచ్చా సుదీప్ నటించే 'K-47' చిత్రంలో నవీన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

4

ఈ సినిమా సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది.

నవీన్ చంద్ర కన్నడ సినిమాలోకి

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర(Naveen Chandra) ‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత త్రిపుర, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, సత్యభామ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే తెలుగు, తమిళ భాషల్లో పలు మూవీస్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. ఇక ఇటీవల ‘లెవన్’ చిత్రం మెప్పించాడు. ప్రస్తుతం నవీన్ చంద్ర విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, నవీన్ చంద్ర ఓ కొత్త సినిమాను ప్రకటించాడు.

‘K-47’ చిత్రంలో కీలక పాత్ర

ఈ చిత్రంతో ఆయన కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ షేర్ చేశాడు. ‘‘తుఫాను రాబోతుంది. ఇది చాలా పిచ్చిగా ఉండబోతుంది. అభినయ చక్రవర్తి బాద్‌షా కిచ్చా సుదీప్ సినిమాలో చేరినందుకు గౌరవంగా ఉంది. వి. కార్తికేయ తెరకెక్కిస్తున్న ఈ ప్రపంచంలో స్నేహితుడి పాత్రను పోషిస్తున్నాను. నా మొదటి కన్నడ చిత్రం కోసం చాలా ఎక్జైటింగ్‌గా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యజ్యోతి ఫిల్మ్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చారు.

ట్విట్టర్ ద్వారా సమాచారం

అలాగే మూవీ టీమ్‌తో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep), వి కార్తికేయ(V. Karthikeya) కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ‘K-47’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

నవీన్ చంద్ర కన్నడ సినీ ప్రయాణం ప్రారంభం కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘K-47’ చిత్రం విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.