|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ramarao : టాలీవుడ్ నిర్మాత కన్నుమూత.. రాజేంద్రప్రసాద్ కి హిట్ ఇచ్చి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నిర్మాత..

Published: 04-05-2025, 6:19 AM
Ramarao : టాలీవుడ్ నిర్మాత కన్నుమూత.. రాజేంద్రప్రసాద్ కి హిట్ ఇచ్చి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నిర్మాత..

టాలీవుడ్ సినీ పరిశ్రమకు విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత జవ్వాజి వెంకట రామారావు కన్నుమూశారు. రాజేంద్రప్రసాద్ హిట్ సినిమా ‘తేనెటీగ’ నిర్మించిన ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

టాలీవుడ్ సీనియర్ నిర్మాత జవ్వాజి వెంకట రామారావు కన్నుమూశారు.

2

రాజేంద్రప్రసాద్ హిట్ సినిమా 'తేనెటీగ' ద్వారా పేరు గాంచారు.

4

అనేక తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా సినిమాలను డబ్ చేశారు.

టాలీవుడ్ లో విషాదం

Ramarao : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కన్నుమూశారు. రాజేంద్రప్రసాద్ తో తేనెటీగ, వంశీ దర్శకత్వంలో నరేష్ – వాణి విశ్వనాధ్ లతో ప్రేమ & కో, శివకృష్ణతో బొబ్బిలివేట, బడి.. లాంటి పలు హిట్ సినిమాలు నిర్మించిన నిర్మాత జవ్వాజి వెంకట రామారావు మరణించారు.

రాజేంద్రప్రసాద్ తేనెటీగ సినిమా హిట్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఆయన పేరు తేనెటీగ రామారావుగా మారింది. తెలుగులోనే సినిమాలు నిర్మించడం కాక అనేక వేరే భాషల సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసారు. గత కొంతకాలంగా రామారావు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మధ్యాహ్నం ఆయన కన్నుమూశారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

తేనెటీగ రామారావు జీవిత విశేషాలు

చివరి క్షణాలు

ప్రముఖ నిర్మాత జవ్వాజి వెంకట రామారావు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.