|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‏లో రీ-రిలీజ్ ట్రెండ్.. ఒకేసారి 6 సినిమాలు..లిస్ట్ ఇదే!

Published: 23-06-2025, 1:18 PM

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో ఆరు సినిమాలు రీ-రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

హనుమాన్ జంక్షన్ సినిమా జూలై 27న రీ-రిలీజ్.

2

కుమారి 21F జూలై 10న, మిరపకాయ జూలై 11న రీ-రిలీజ్.

3

గజిని, ఏం మాయ చేశావే జూలై 18న రీ-రిలీజ్.

4

వీడొక్కడే సినిమా ఆగస్టు 19న రీ-రిలీజ్.

జూలైలో రిలీజ్ అయ్యే సినిమాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా రీ- రిలీజ్ అయిన ప్రతి సినిమా మంచి కలెక్షన్స్ రాబోతుంది. ముఖ్యంగా.. సినిమా రిలీజ్ అయిన సమయంలో చూడని అభిమానులు అందరూ… తమ అభిమాన హీరోల సినిమాలను రీ రిలీజ్ సమయంలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖలేజా లాంటి సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి.

ఆగస్టులో రిలీజ్ అయ్యే సినిమాలు

ఇక ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు దాదాపు 6 సినిమాలు వరుసగా రీ- రిలీజ్ కాబోతున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో అలాగే టీవీలలో ఈ సినిమాలను జనాలు ఏగబడి చూశారు. అందుకే అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఈ లిస్టులో హనుమాన్ జంక్షన్ సినిమా కూడా ఉంది. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన మళ్లీ రిలీజ్ కాబోతుంది. అలాగే జూలై 10వ తేదీన కుమారి 21F మూవీ రిలీజ్ అవుతుంది.

రీ-రిలీజ్ ట్రెండ్ కారణాలు

ఇక జూలై 11వ రవితేజ నటించిన మిరపకాయ సినిమా రీ రిలీజ్ కానుంది. జూలై 18న గజిని, ఏం మాయ చేసావే రెండు సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. సమంత అలాగే అక్కినేని నాగచైతన్య ఇద్దరి ప్రేమకు ఏం మాయ చేసావే సినిమానే (Ye maya chesave) కారణం. అలాంటి సినిమా ఇప్పుడు మళ్లీ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం చూస్తున్నారు. ఇక వచ్చే నెల 19వ తేదీన వీడొక్కడే రీ-రిలీజ్ అవుతుంది.

అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాలన్నీ మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. ఈ రీ-రిలీజ్‌లు బాక్సాఫీస్‌లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.