|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌కి ఊహించని షాక్‌.. IMDb టాప్-10 సినిమాల్లో దక్కని అవకాశం!

Published: 11-07-2025, 6:18 AM
టాలీవుడ్‌కి ఊహించని షాక్‌.. IMDb టాప్-10 సినిమాల్లో దక్కని అవకాశం!

ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాలుగా కొట్టిపారేయబడ్డ తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. అయితే, IMDb టాప్ 10 జాబితాలో తెలుగు సినిమాలకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.

Key Points

1

IMDb టాప్ 10లో ఏ ఒక్క తెలుగు సినిమాకూ చోటు దక్కలేదు.

2

2023 తొలి ఆరు నెలల్లో విడుదలైన బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాలు కూడా IMDb జాబితాలో లేవు.

4

IMDb రేటింగ్స్ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

IMDb టాప్ 10 జాబితాలో టాలీవుడ్‌కు నిరాశ

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే అనేవారు. మిగతావన్నీ ప్రాంతీయ సినిమాలు అని కొట్టి పడేసేవారు. అందులోనూ తెలుగు సినిమాలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాంటిది.. నార్త్ ఇండియా ప్రేక్షకులు సైతం టాలీవుడ్ సినిమాల విడుదల కోసం ఎదురుచూసే స్థితికి వచ్చారు. ఇందుకు బహుబలి మూవీ పునాదులు వేస్తే.. ఆర్‌ఆర్‌ఆర్ ఆ ఊపును ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఆస్కార్ గెలిచి హైదరాబాద్ నుంచి హాలీవుడ్ వరకు టాలీవుడ్ ప్రయాణాన్ని సంచలనంగా మార్చింది. కానీ, ఇప్పుడు ఇదే టాలీవుడ్ ఇంట్లోనే గెలువలేకపోయిందా? అనే సందేహాన్ని కలిగిస్తోంది. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ విడుదల చేసిన ఈ ఏడాది తొలి ఆరు నెలల టాప్ 10 ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాలో ఒక్క తెలుగు సినిమాకు కూడా చోటు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

బాక్సాఫీస్ హిట్లు, IMDb రేటింగ్స్ మధ్య విరుద్ధత

జనవరి 1 నుంచి జులై 1 మధ్య ప్రేక్షకులు ఎక్కువగా మెచ్చిన సినిమాల జాబితా:

IMDb రేటింగ్ విధానంపై సందేహాలు

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి చాలానే సినిమాలు విడుదల అయ్యాయి. అందులో “సంక్రాతికి వస్తున్నాం”, “మ్యాడ్ స్క్వేర్”, “సింగిల్”, “శుభం”, “కోర్టు”, “కుబేర”, “ఢాకూ మహారాజ్”, “తండేల్” లాంటి సినిమాలు వాణిజ్యంగా బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. కానీ అవి IMDb టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఇక బాక్సాఫీస్ వద్ద పూర్తిగా ఫెయిల్ అయిన కొన్ని సినిమాలు IMDbలో మంచి రేటింగ్ తెచ్చుకోవడం, ఈ సంస్థ రేటింగ్స్‌పై ప్రశ్నలు తీసుకొస్తోంది.

టాలీవుడ్ సినిమాల ప్రజాదరణ ఉన్నప్పటికీ, IMDb ర్యాంకింగ్స్‌లో వాటికి తగిన గుర్తింపు దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై మరిన్ని చర్చలు అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.