
టాలీవుడ్ చరిత్రలో కొన్ని సినిమాలు క్లైమాక్స్ ట్విస్ట్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి! సాధారణ కథలను కూడా బ్లాక్‌బస్టర్‌లుగా మార్చిన ఆ అదిరిపోయే మలుపులు ఏంటి? మహేష్, ప్రభాస్, చరణ్ సినిమాలను సంచలన విజయాలుగా నిలిపిన ఆ క్లైమాక్స్ సీక్రెట్స్ ఇప్పుడు చూద్దాం!
Key Points
మహేష్ బాబు పోకిరి IPS ట్విస్ట్.. టాలీవుడ్ చరిత్రలో బెస్ట్ సీన్, రికార్డులు బద్దలు.
కట్టప్ప బాహుబలిని చంపాడు.. జాతీయ సంచలనం, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ.
రామ్ చరణ్ రంగస్థలం క్లైమాక్స్ నటన.. నెక్స్ట్ లెవెల్, విమర్శకుల ప్రశంసలు.
ప్రభాస్ కల్కిలో కర్ణుడిగా రివీల్.. గూస్‌బంప్స్ తెప్పించిన సీన్, భారీ అంచనాలు.
పోకిరి: మహేష్ కెరీర్ మార్చిన ఆ మాస్ ట్విస్ట్!
ఎలాంటి సినిమా అయినా విజయం సాధించాలి అంటే క్లైమాక్స్ సన్నివేశాలు చాలా కీలకం. మంచి క్లైమాక్స్ ఎపిసోడ్ పడితే అప్పటి వరకు యావరేజ్ గా సాగిన సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయిపోతాయి. గతంలో ఇలా చాలా సార్లు జరిగింది. క్లైమాక్స్ సన్నివేశాలకు తగ్గట్లుగా షాకింగ్ ట్విస్ట్స్ పెడితే మూవీ రేంజ్ ఇంకా పెరుగుతుంది. అలా బెస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ లతో సూపర్ హిట్స్ అయిన 5 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోకిరి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో ట్విస్ట్ ల గురించి మాట్లాడాల్సి వస్తే పోకిరి రేంజ్ ట్విస్ట్ అని దీనితోనే పోలుస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీలో ఐపీఎస్ అధికారి అని రివీల్ అయ్యే సన్నివేశం టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ సీన్స్ లో ఒకటి అని చెప్పొచ్చ. అప్పటి వరకు యావరేజ్ గా సాగిన పోకిరి మూవీ ఆ ఒక్క ట్విస్ట్ తో పీక్ కి చేరుకుంటుంది.
బాహుబలి: కట్టప్ప ఎందుకు చంపాడు? సంచలన సస్పెన్స్!
బాహుబలి 1 చిత్రాన్ని ముందుగా అందరూ ఫ్లాప్ అన్నారు. కానీ నెమ్మదిగా ఈచిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది అంటే ప్రధాన కారణం ‘బాహుబలిని చంపింది నేనే’ అంటూ కట్టప్ప ఇచ్చే షాక్. దీనితో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది.
రంగస్థలం చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కానీ క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ గురించి చిట్టిబాబు నిజం తెలుసుకునే సన్నివేశం అదిరిపోయింది. ఆ సీన్ లో రాంచరణ్ నటన నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.
రంగస్థలం, కల్కి: ఊహించని మలుపులు, బాక్సాఫీస్ షేక్!
కిరణ్ అబ్బవరం నటించిన క చిత్రం అతడికి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీలో ఉన్న క్లైమాక్స్ సన్నివేశాలు అంతకు ముందెప్పుడూ ఇండియన్ సినిమాలో రాలేదు అనే చెప్పాలి. కర్మ సిద్ధాంతంతో అద్భుతమైన పాయింట్ తీసుకుని అదరగొట్టేశారు. ఈ మూవీలో క్లైమాక్స్ సీన్ అద్భుతమైన థ్రిల్ ని పంచుతుంది.
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి చిత్రం పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి. అన్నింటి కంటే క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడు అని రివీల్ అయ్యే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
ఈ క్లైమాక్స్ ట్విస్ట్‌లు టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాలు విజయం సాధించడంలో క్లైమాక్స్ ఎంత కీలకమో ఈ చిత్రాలు నిరూపించాయి. మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం వేచి ఉండండి!

