“
Double iSmart Now Streaming on OTT
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. బ్లాక్‌బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా రూపొందించిన ఈ సినిమా, ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలయింది. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా, ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ పోతినేని అభిమానులు ఈ సినిమా థియేటర్లలో మిస్సయితే, ఇప్పుడు ఓటీటీలో ఎంజాయ్ చేయవచ్చు.
కథ సారాంశం:
ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. అతని తల్లి పోచమ్మను చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునేందుకు శంకర్ నడుస్తాడు. మరోవైపు, బ్రెయిన్ ట్యూమర్ కారణంగా బిగ్ బుల్ త్వరలో మరణిస్తాడని తెలుసుకొని, మెమోరీ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా తన జ్ఞాపకాలను శంకర్‌కి మార్చాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కథ ఎటువంటి మలుపులు తీసుకుందో, శంకర్ తన లక్ష్యాన్ని ఎలా సాధించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.