యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’(Devara) అనే మూవీలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటిస్తోంది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు పరిచయం కానుండటం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని ఈ చిత్రంపై భారీగా అంచనాలను పెంచేశాయి. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్ల బిజీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్ హీరోలు విశ్వక్ సేన్(Vishwaksen), సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda).. ఎన్టీఆర్‌ను, డైరెక్టర్ కొరటాల శివను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో తారక్ ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. “దేవర సినిమా షూటింగ్ గోవాలో చేస్తున్నప్పుడు సముద్రంలో సీన్ చెయ్యాలి. అయితే పైన ఎండ చాలా వేడిగా ఉంది అప్పుడు నేను ఆ వేడికి తట్టుకోలేక పోయా. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఆ పక్కన ఓ రూమ్ పెట్టారు దానికి ఏసీ ఉంది. అప్పుడు వెళ్ళిపోతా అని నేను.. ఒక్క షాట్ ఉంది అని శివ, చివరికి నేను తట్టుకోలేక, నేను పోతా చచ్చిపోయేలా ఉన్నాను అని అన్నాను.. అసలు ఆ టైంలో నేను చచ్చిపోతాను అనుకున్నా, భార్య పిల్లలు ఒక్క క్షణం గుర్తొచ్చారు. నా జీవితం ఏంటి? నేను చచ్చిపోతానా? అని అనిపించింది. అలాంటప్పుడు షూట్ అయిపోయింది. షాట్ ఓకే అన్నారు. అక్కడే లుంగీ తీసేసి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ రూమ్‌లో డోరు మూసేశా. ఒక్క సెకన్ చల్లగా అనిపించింది. బతికాను రా అని అలా బెడ్డు మీద పడుకున్నాను. అంతే హమ్మయ్య అని అనుకునేలోగా కరెంట్ పోయింది. ఫోన్ చేస్తే జనరేటర్ పాడైందన్నారు. ఆ కష్టం పగవాడికి కూడా రావొద్దు” అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు సినిమా షూటింగ్ కోసం ఇంత కష్టపడతారా అని కామెంట్స్ చేస్తున్నారు