.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “నచ్చావులే” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మాధవి లత మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. తాను సినిమాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినా, సోషల్ మీడియాలో సొసైటీ మరియు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి విషయంపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
తాజాగా జానీ మాస్టర్ ఘటనపై కూడా మాధవి లత కీలక వ్యాఖ్యలు చేసింది. నాగబాబు జానీ మాస్టర్‌కి సపోర్ట్‌గా పోస్ట్ చేయడం తనను బాధపెట్టిందని మాధవి లత తెలిపింది. “నాగబాబుకి కూడా కూతురు ఉంది కదా, పైగా బాధిత అమ్మాయి నా కంటే చిన్న వయసు” అంటూ నాగబాబుకు కౌంటర్ ఇచ్చింది. మహాసేన రాజేష్ కూడా జానీ మాస్టర్‌కి సపోర్ట్ చేస్తూ ఫాలోవర్స్‌కి తప్పుదారి చూపిస్తున్నాడని, ఇది అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించింది.
16 సంవత్సరాల వయసులో జానీ మాస్టర్ ప్రేమ మాటలు చెప్పి ఆ అమ్మాయిని మోసగించాడని, ఆరు నెలలు రిలేషన్‌లో ఉన్న తర్వాత అతడి అసలు స్వరూపం తెలుసుకొని బయటకు వచ్చిందని తెలిపింది. అంతేకాకుండా, జానీ మాస్టర్ ఆమెను బహిరంగంగా కొట్టాడని, ఆమె ఇండిపెండెంట్‌గా పనిచేయడం అతనికి ఇష్టం లేక, షూటింగ్‌ల దగ్గర ఆమెను అవమానించాడని చెప్పింది.
మూవీ ఛాంబర్ పెద్దలు జానీ మాస్టర్‌ను సస్పెండ్ చేయడం, అల్లు అర్జున్, సుకుమార్ బాధిత అమ్మాయికి సపోర్ట్‌గా నిలవడం ఇవన్నీ న్యాయం కోసమేనని పేర్కొంది. “నాగబాబుకు కూడా కూతురు ఉంది కదా” అంటూ ట్రోలర్స్‌కి, నాగబాబుకి గట్టి కౌంటర్ ఇచ్చింది.