ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ (YCP) నేత, సినీ రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నట్లుగా ప్రకటించారు. ఇక నుంచి పాలిటిక్స్ (Politics) జోలికి వెళ్లబోననని ఆయన వెల్లడించారు. అదేవిధంగా రాజకీయాలపై కూడా ఎన్నడూ మాట్లాడబోనని స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదని తెలిపారు. ఏ పార్టీని అయినా తాను సామన్య ఓటరులాగే ప్రశ్నించానని.. మంచి చేస్తే వాళ్లకి సపోర్ట్ చేశానని అన్నారు. తన చివరి శ్వాస వరకు కుంటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) స్టేట్మెంట్ ఇచ్చారు.
కాగా, వైసీపీ మద్దుతుదారుడైన పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)పై ఇటీవలే ఏపీ సీఐడీ (AP CID) కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత (Andhra Pradesh Telugu Yuvatha) ప్రతినిధి బండారు వంశీకృష్ణ (Bandaru Vamsi Krishna) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ (AP CID) అధికారులు ఆయపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ నెలలో ఓ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) మీడియాలో మాట్లాడారని వంశీకృష్ణ (Vamsi Krishna) ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోసానిపై 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ సెక్షన్ల ప్రకారం ఏపీ సీఐడీ (AP CID) కేసు నమోదు చేసింది.