ప్రధాన పాత్రలో నటిస్తోన్న పుష్ప-2(Pushpa-2) చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తోంది. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్(pre release event)కు పోలీసుల అనుమతి కోరగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
డిసెంబర్ 2వ తేదీన యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహణకు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తోంది. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.