
టాలీవుడ్ సూపర్ స్టార్ల మధ్య గ్లోబల్ స్టార్‌గా ఎవరు నిలవబోతున్నారనేది ఆసక్తికరమైన ప్రశ్న. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో తమ సత్తా చాటుకున్నారు. కానీ 2027లో విడుదల కానున్న కొన్ని భారీ చిత్రాలు ఈ పోటీని మరింత ఉధృతం చేయనున్నాయి.
Key Points
రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో 'ఎస్ఎస్ఎంబి29' అత్యధిక అంచనాలతో.
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో 'ఎఎ22' భారీ బడ్జెట్ చిత్రంగా.
ప్రభాస్ నటించిన 'స్పిరిట్' సినిమా కూడా గ్లోబల్ బాక్సాఫీస్ లక్ష్యంగా.
2027 సంవత్సరం టాలీవుడ్ చరిత్రలో మైలురాయిగా నిలవనుంది.
గ్లోబల్ స్టార్ పోటీ
టాలీవుడ్ సూపర్ స్టార్ల స్టార్ ఫైట్… ఇప్పుడు గ్లోబల్ ఫైట్‌గా మారింది. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ హీరోలు రాణిస్తుండడం, అయితే ఒకరి తర్వాత ఒకరు రికార్డ్స్ బద్దలు కొట్టడంతో… వీరిలో ఎవరు నెం1 గ్లోబల్ స్టార్ అనేది ఇంకా తేలలేదు. తొలుత ప్రభాస్, తర్వాత ఎన్టీయార్, రామ్ చరణ్, ఆ తర్వాత అల్లు అర్జున్… పాన్ ఇండియా సినిమాల ద్వారా సత్తా చాటారు. అయితే వీరిలో ఎవరు టాప్ అనేది ఇంకా నిరూపణ కాలేదు.
ఈ నేపధ్యంలో వచ్చే 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. టాలీవుడ్ స్టార్ల నుంచి దూసుకు వస్తున్న మూడు భారీ ప్రాజెక్టులు ఎస్‌ఎస్‌ఎంబి29, ఎఎ22, స్పిరిట్… చిత్రాలు మూడూ గ్లోబల్ బాక్సాఫీస్‌ను లక్ష్యంగా చేసుకొని రూపొందుతున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
2027: కీలక సంవత్సరం
ఈ మూడింటిలో రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న తొలిచిత్రం ఎస్‌ఎస్‌ఎంబి29పై అత్యధికంగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ ద్వారా ఇప్పటికే గ్లోబల్ ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో పూర్తి మేకోవర్‌తో కనిపించనున్నాడు. సమాచారం. అంతేకాక పాన్ ఇండియా సినిమా లో తన సత్తా తొలిసారి చాటనున్నాడు.
అల్లూ అర్జున్, అట్లీ కాంబినేషన్ లో మాస్ అండ్ స్టైల్ ఎంటర్టైనర్‌గా ఎఎ22 చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 2వ చిత్రంగా నిలవబోతోంది. విజువల్స్, యాక్షన్, హై ఎనర్జీ ప్రెజెంటేషన్ కారణంగా ఇది ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ సూపర్ హీరో సినిమాల అభిమానులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు.
భారీ ప్రాజెక్టుల ప్రభావం
హీరోగా ఇప్పటికే గ్లోబల్ స్టార్ డమ్‌ను స్వంతం చేసుకున్న ప్రభాస్…స్పిరిట్ కూడా రేసు లో వుంది. తన ప్రతీ సినిమా ద్వారా ప్రేక్షకులకు షాక్ కొట్టే కధాంశాలతో హిట్స్ కొట్టే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు, ఇప్పటికే దీపిక పదుకునే నిష్క్రమణ సందీప్ వంగా పై కామెంట్స్ తదితర వార్తల ద్వారా ఈ చిత్రం నిత్యం సినీ అభిమానుల నోట్లో నానుతోంది.ఈ చిత్రం యాక్షన్, డార్క్ థీమ్, బోల్డ్ నెరేటివ్ తో రూపొందుతోంది. అంతర్జాతీయ నటుల ఎంపిక, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ వంటి లతో ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది.
ఈ మూడు ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశముంది. ప్రతి చిత్రమూ దేనికదే తనదైన ప్రత్యేకతను కలిగి ఉండటంతో, ఇండియన్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తదుపరి సినిమాలకు ఈ మూడూ దేనికదే ప్రత్యేక శైలి లో దిశా నిర్ధేశ్యం చేయనున్నాయి. ఆ మార్గదర్శకత్వం చేస్తున్నవారు దక్షిణాది వారు అందులోనూ ఒక్క అట్లీ తప్ప అందరూ తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణమే.
2027లో విడుదలయ్యే ఎస్ఎస్ఎంబి29, ఎఎ22, స్పిరిట్ చిత్రాల ఫలితాలు టాలీవుడ్ గ్లోబల్ స్టార్ ఎవరో నిర్ణయించే అంశాలుగా ఉంటాయి. ఈ మూడు సినిమాలు భారీ అంచనాలను మోస్తున్నాయి.


