|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా కెరీర్‌లోనే ఇది అతిపెద్ద సవాలు.. ‘లోకా-2’ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన టోవినో థామస్

Published: 07-04-2026, 6:05 AM
  • టోవినో థామస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది! ‘లోకా 2’లో 389 విభిన్న పాత్రల్లో కనిపించనున్న టోవినో.
  • 2025లో వచ్చిన ‘లోకా: చాప్టర్ 1’ భారీ విజయం సాధించడంతో, సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
  • దర్శకుడు డొమినిక్ అరుణ్‌తో టోవినో నిరంతరం స్క్రిప్ట్ గురించి చర్చిస్తున్నారని సమాచారం.
  • భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ 2026 డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ‘లోకా 2’తో సరికొత్త సంచలనానికి తెర తీయబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఏకంగా 389 విభిన్న పాత్రల్లో కనిపించనుండటం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

389 పాత్రల్లో టోవినో థామస్!

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ తన అప్ కమింగ్ మూవీ ‘లోక 2’ గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన వెల్లడించిన విషయాలు వింటుంటే, ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ తెరపై ఒక అద్భుతమైన ప్రయోగం అని అర్థమవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టోవినో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సినిమాలో టోవినో ఏకంగా 389 విభిన్న రూపాల్లో కనిపించాల్సి ఉంటుందట. దీనిపై ఆయన స్పందిస్తూ.. “నా కెరీర్‌లోనే ఇది అతిపెద్ద అత్యంత కష్టమైన సవాలు. ఒకే సినిమాలో ఇన్ని వందల పాత్రలను ఎలా చూపిస్తామో నాకే కచ్చితంగా తెలియదు. వాటన్నింటినీ కేవలం పరిచయం చేయడానికే ఒక మూవీ సరిపోతుంది.

ఆ పాత్రలన్నీ చూపించేసరికి సినిమా అయిపోవచ్చు, అందుకే అసలు కథను పూర్తి చేయడానికి మాకు ‘లోక 3’ కూడా అవసరం కావచ్చు” అని తనదైన శైలిలో వివరించారు.ప్రస్తుతానికి ఈ మూవీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, దీనిపై దర్శకుడు డొమినిక్ అరుణ్‌తో నిరంతరం చర్చలు జరుపుతున్నామని టోవినో తెలిపారు. ఇప్పటికే 2025లో వచ్చిన ‘లోక: చాప్టర్ 1’ పెద్ద హిట్ అవ్వడంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో పౌరాణిక జీవి అయిన ‘కల్లియంకట్టు నీలి’గా చంద్ర గుర్తింపు బయటపడటంతో కథ ముగిసింది. ఇప్పుడు రెండో భాగంలో టోవినో 389 పాత్రలతో ఆ మిస్టరీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణం 2026 డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

‘లోకా 2’ స్క్రిప్ట్ రెడీ!

2026లో షూటింగ్ ప్రారంభం!

‘లోకా 2’ చిత్రం టోవినో కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.