
📌 Key Points
- గంగా దామోదర్ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్ బాత్రూం సీలింగ్‌లో బీర్లు దాచి తరలింపు.
- జార్ఖండ్ నుండి బీహార్‌కు అక్రమంగా మద్యం తరలించే ప్రయత్నం.
- బీహార్‌లో మద్యం నిషేధం కారణంగా ఈ తరలింపు.
- రైల్వే పోలీసులు తనిఖీ చేసి, ముఠాపై కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వింత సంఘటన కలకలం రేపుతోంది. గంగా దామోదర్ ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్ బాత్రూం సీలింగ్‌లో బీర్లను దాచి అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. జార్ఖండ్ నుండి బీహార్‌కు మద్యం తరలింపు వెనుక కారణాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
రైలు బాత్రూంలో బీర్ల అక్రమ రవాణా
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే, మరికొన్ని వింత సంఘటనలు కూడా ఉంటాయి. అయితే తాజాగా ట్రైన్ బాత్రూంలో బీర్లు తరలించిన సంఘటన వైరల్ గా మారింది. ఈ దారుణమైన సంఘటన గంగా దామోదర్ ఎక్స్ ప్రెస్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ లోని ధన్ బాద్ ప్రాంతం నుంచి నిత్యం పాట్నాకు గంగా దామోదర్ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది. అయితే ఈ ట్రైన్ లో చాలా మంది బీహార్ కు వెళ్తూ ఉంటారు. వాస్తవంగా బీహార్ లో కంటే జార్ఖండ్ లో మద్యం ధరలు తక్కువగా ఉంటాయట.
జార్ఖండ్ నుండి బీహార్‌కు మద్యం తరలింపు
అలాగే కల్తీ లేని మద్యం దొరుకుతుందని సమాచారం. దీంతో చాలామంది బీహార్ మందుబాబులు… ఈ ట్రైన్ ద్వారా బీర్లు, లిక్కర్ బాటిల్స్ అక్రమంగా తరలిస్తుంటారు. ఈ క్రమంలోనే గంగా దామోదర్ ఎక్స్ ప్రెస్ లో ఏకంగా బాత్రూం సీలింగ్ లో బీర్లను దాచారు స్మగ్లర్లు. జార్ఖండ్ నుంచి పాట్నా తరలించే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చిన నేపథ్యంలో రైల్వే పోలీసులు చెక్ చేశారు. దీంతో అసలు రంగు బయటపడింది. వాష్ రూమ్ లో ఉన్న సీలింగ్ ఓపెన్ చేసి చూడగానే పదుల సంఖ్యలో బీర్లు వెలుగు చూశాయి. ఇక ఈ సంఘటన నేపథ్యంలో అక్రమ మద్యం తరలిస్తున్న ముఠాపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు…. విచారణ చేపట్టారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
పోలీసుల తనిఖీలో బయటపడిన బండారం
A post shared by Akhilesh Yadav (@lastminuteofindia)
ఈ సంఘటన మద్యం నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో అక్రమ రవాణా ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తుంది. ఇలాంటి నేరాలను అరికట్టడానికి మరింత కఠిన చర్యలు అవసరం.



Zareen Khan’s Epic Reply to Photographer’s Indecent Demand Goes Viral