
బాహుబలి కట్టప్ప సత్యరాజ్ నటించిన త్రిబాణధారి బార్బరిక్ చిత్రం గురించి నటుడు వశిష్ట ఎన్ సింహా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చిత్రం సమాజంలోని వివిధ ఘటనలకు సమాధానం ఇస్తుందని ఆయన అన్నారు.
Key Points
త్రిబాణధారి బార్బరిక్ చిత్రం విడుదలైంది.
వశిష్ట ఎన్ సింహా ఇంటర్వ్యూలో చిత్రం గురించి మాట్లాడారు.
చిత్రం సమాజంలోని ఘటనలకు సమాధానం ఇస్తుందని వశిష్ట అన్నారు.
మైథలాజికల్, సోషల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందించబడింది.
త్రిబాణధారి బార్బరిక్ విడుదల
బాహుబలి కట్టప్ప సత్యరాజ్, ఉదయభాను , వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, సాంచీ రాయ్ కలిసి నటించిన లేటెస్ట్ మైథలాజికల్ సోషల్ డ్రామా చిత్రం త్రిబాణధారి బార్బరక్. డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైంది.
థియేటర్లలో రిలీజ్ అయిన త్రిబాణధారి బార్బరిక్‌కు రెస్పాన్స్ పర్వాలేదు. అయితే, ఈ మూవీ రిలీజ్‌కు ముందు నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో త్రిబాణధారి బార్బరిక్ కథా నేపథ్యం, తదితర ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నాడు నటుడు వశిష్ట ఎన్ సింహా.
– మైథలాజికల్ పాత్రలతో సినిమాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఇదొక ట్రెండ్‌లా మారింది. ఇప్పుడు మేం ‘బార్బరిక్’ పాత్రతో వచ్చాం. ఇలాంటి మైథలాజికల్ పాత్రలతో సినిమాలు ఇంకా వస్తే చాలా మంచిది. వీరందరి గురించి మన ముందు తరాలు తెలుసుకోవాలి. అయితే మా మూవీ పూర్తిగా మైథలాజికల్ జానర్‌లో ఉండదు.
వశిష్ట ఎన్ సింహా ఇంటర్వ్యూ
-బార్బరికుడు, అతని శక్తిని ఈ తరానికి మేం చెప్పే ప్రయత్నం చేశాం. బార్బరికుడు చుట్టూ కథను రాసుకోలేదు. బార్బరికుడు థీమ్ నుంచి తీసుకుని కథను అల్లుకున్నారు. ఇది నార్త్, సౌత్ అని కాకుండా ప్రతీ మనిషికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా బార్బరిక్ చిత్రం ఉంటుంది.
– విజయ్ పాల్ రెడ్డి గారు వానరా సెల్యూలాయిడ్ మీద మంచి కంటెంట్ చిత్రాలను తీయాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా ‘బార్బరిక్’ మొదటి చిత్రం. ఇలాంటి మంచి కంటెంట్ బేస్డ్ చిత్రాలను మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను. ఆయనకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది.
– మోహన్ గారు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. చాలా టైం తీసుకుని కథను రాసుకున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీని చిత్రీకరించారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
చిత్ర కథానేపథ్యం
-‘బార్బరిక్’ మూవీ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది. చాలా వరకు నైట్ షూట్స్, రెయిన్ షాట్స్ ఉంటాయి. ఈ క్రమంలో దర్శకుడు, కెమెరామెన్ చాలా కష్టపడ్డారు. ప్రతీ చిన్న డీటైలింగ్‌ను వదిలి పెట్టేవారు కాదు. అలా చాలా సార్లు ఎన్నో టేక్స్ చేసేవాళ్లం.
-సమాజంలో రకరకాల ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అనే వాటికి సమాధానాలు దొరకవు. కానీ, మా బార్బరిక్ మూవీ వాటికి సమాధానాలు చెబుతుంది. ఓ మంచి సందేశాన్ని ఇస్తూ తీసిన మా చిత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్‌ని ఎక్కడా నిరాశపర్చదని కచ్చితంగా చెప్పగలను.
త్రిబాణధారి బార్బరిక్ చిత్రం ప్రేక్షకులను నిరాశపర్చదని వశిష్ట ఎన్ సింహా ధీమా వ్యక్తం చేశారు. సమాజానికి సంబంధించిన సందేశాన్ని ఇచ్చే ఈ చిత్రం విజయవంతం అవుతుందని ఆశిద్దాం.


