|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒక్కసారిగా గ్రాఫ్ చేంజ్ అయిపోయిందిగా. ప్రభాస్ సరసన నటించడానికి ఏకంగా అన్ని కోట్లు తీసుకుంటున్న త్రిప్తి దిమ్రి

Published: 31-05-2025, 12:48 AM

ప్రభాస్ నటించే ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు. తాజాగా ఆమె పారితోషికం గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. రూ.4 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Key Points

1

త్రిప్తి దిమ్రి 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.

2

ఆమె పారితోషికం రూ. 4 కోట్లు అని వార్తలు.

3

ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వార్తపై స్పందిస్తున్నారు.

4

త్రిప్తి దిమ్రి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

త్రిప్తి దిమ్రి – స్పిరిట్ సినిమా హీరోయిన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన నటిస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit). స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూస్తామా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ(Tripthi Dimri) హీరోయిన్‌గా నటించమన్నట్లు రీసెంట్‌గా అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ అమ్మడు గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో ఈ బ్యూటీ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇప్పటివరకు హైయెస్ట్‌గా రూ.40లక్షల వరకు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన స్పిరిట్ మూవీలో నటించడానికి ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటుందంట. మరి ప్రభాస్ – త్రిప్తి దిమ్రి రొమాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ప్రభాస్ ఫ్యాన్స్ మరి మన డార్లింగ్ సరసన నటించాలంటే ఆమాత్రం తీసుకోవద్దా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పారితోషికంపై వార్తలు

సోషల్ మీడియా స్పందన

త్రిప్తి దిమ్రి పారితోషికం విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ సరసన ఆమె నటన ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.