
📌 Key Points
- త్రిష పెళ్లి, విజయ్‌తో రిలేషన్ రూమర్లపై ఘాటుగా స్పందించారు.
- తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలను ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
- సినిమాలకు గుడ్‌బై చెప్పడం, బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకోవడం వంటి వార్తలను ఖండించారు.
- విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండగా, త్రిష ఆయనకు మద్దతుగా ప్రచారం చేయనున్నారనే వార్తలు వచ్చాయి.
సౌత్ సినీ పరిశ్రమలో సీనియర్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష కృష్ణన్ తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై స్పందించారు. విజయ్‌తో ఆమె రిలేషన్ గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఈ రూమర్స్‌పై ఆమె సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు.
త్రిష పెళ్లి వార్తలపై స్పందన
Actress Trisha: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి త్రిష కృష్ణన్ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె ఇప్పటికీ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న త్రిష గురించి గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాలపై పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈమె పెళ్లి గురించి లవ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
గత కొంతకాలంగా త్రిష నటుడు విజయ్ తో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈ వార్తలను మాత్రం ఎక్కడా ఖండించలేదు ఈ వార్తలకు అనుగుణంగానే విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక వార్త బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. తమిళనాడులో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఈమె విజయ్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, సినిమాలకు కూడా దూరం కాబోతున్నారు అంటూ తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితం గురించి నిత్యం వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రిష ఈ వార్తలపై స్పందించారు.
రూమర్లపై త్రిష ఘాటు వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే త్రిష తన ఇంస్టాగ్రామ్ స్టోర్ ద్వారా ఈ వార్తలను ఖండించారు. ఇలా ఈ వార్తలపై స్పందించిన త్రిష తాను సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నానట, ఒక బిజినెస్ మెన్ పెళ్లి చేసుకోబోతున్నానని, నిన్నటితో రెండు సంవత్సరాలు నిండిన నలుగురు పిల్లలను పెంచుకుంటున్నానట. ఇంకా ఏవైనా ఉంటే అదే చెప్పేసేయండి.. ఈరోజుకు ఈ రూమర్స్ చాలు అంటూ త్రిష తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా తన వ్యక్తిగత జీవితం గురించి ఈ విధమైనటువంటి ప్రశ్నలు రావడంతోనే త్రిష రియాక్ట్ అయ్యారని చెప్పాలి.
రూమర్లకు చెక్ పెట్టిన త్రిష…
విజయ్, త్రిష రిలేషన్ రూమర్స్
ఇక త్రిష విజయ్ తో గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నారు. ఇలా వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చిన వీరిద్దరూ ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం విజయ్ రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో త్రిష సైతం విజయ్ కు మద్దతుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటన చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇలా తన గురించి ఏదో ఒక వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో త్రిష ఈ రూమర్లపై గట్టిగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక ఈమె సినిమాలకు దూరం కాబోతోంద వార్తలు వచ్చాయి . స్వయంగా సీనియర్ నటుడు లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈమె సినిమాల గురించి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే త్రిష స్పందనతో ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టినట్టు అయింది.
మొత్తానికి, త్రిష తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై స్పందిస్తూ ఒక క్లారిటీ ఇచ్చింది. తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలకు ఆమె గట్టిగా సమాధానం చెప్పింది.


