|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్విషా శర్మ మృతి: సీబీఐకి కేసు అప్పగింత, మీడియాకు సుప్రీంకోర్టు సంచలన హెచ్చరిక!

Published: 25-05-2026, 5:16 AM
ట్విషా శర్మ మృతి: సీబీఐకి కేసు అప్పగింత, మీడియాకు సుప్రీంకోర్టు సంచలన హెచ్చరిక!
  • ట్విషా శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా స్వీకరించి, సీబీఐకి అప్పగించింది.
  • మీడియా, కేసులోని ఇరు వర్గాలు బహిరంగ ప్రకటనలు చేయవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
  • బయటి కథనాల కారణంగానే సీబీఐకి అప్పగింత అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
  • దర్యాప్తును ప్రభావితం చేసే కథనాలు ప్రచురించవద్దని మీడియాకు సుప్రీంకోర్టు హితవు పలికింది.

నటి ట్విషా శర్మ మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సంచలన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. మీడియా, ఇరువర్గాలు దర్యాప్తును ప్రభావితం చేయవద్దని గట్టిగా హెచ్చరించింది. న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లకుండా చూడాలని సూచించింది.

ట్విషా శర్మ కేసు: సీబీఐకి అప్పగింత

దేశంలో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో (Twisha Sharma Death Case) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా స్వీకరించిన (Suo Motu) ఈ కేసు విచారణ సందర్భంగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని కోర్టుకు వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తును కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించనున్నట్లు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.ః

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Suryakant) నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మీడియా, కేసుతో సంబంధం ఉన్న ఇరు వర్గాల తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు సాగుతున్న సమయంలో ఇరుపక్షాలు గానీ, బాధితురాలి కుటుంబ సభ్యులు గానీ మీడియా ముందు ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. బాధితురాలి కుటుంబం, అవతలి పక్షం ఇచ్చే ప్రకటనల వెనుక పరిగెత్తవద్ది చెప్పింది. లేని పక్షంలో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాత విచారణను అనుమతించడం లేదనే ఓ తప్పుడు మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుందని అన్నారు. తమకు రాష్ట్ర దర్యాప్తు సంస్థ, సీబీఐపై గానీ ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కేవలం బయట సృష్టించబడుతున్న కథల వల్లే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నామని తెలిపారు. జరిగిన దురదృష్టకర ఘటనపై పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా తాము చూస్తామని అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. అదేవిధంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా మీడియా కథనాలు వండివార్చకూడదని, న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గేలా ప్రచారాలు చేయవద్దని హితవు పలికింది.

మీడియా, పార్టీలకు సుప్రీంకోర్టు హెచ్చరిక

నిష్పక్షపాత దర్యాప్తుపై సీజేఐ హామీ

ట్విషా శర్మ మృతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, మీడియాకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేయడం ఈ కేసులో కీలక మలుపు. న్యాయవ్యవస్థ పారదర్శకత, నిష్పక్షపాత దర్యాప్తును కాపాడటానికి ఈ ఆదేశాలు ఎంతగానో దోహదపడతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.