|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇద్దరు క్యూట్ భామలతో టాక్ షో.. మరో రేంజ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌.. ఏ ఓటీటీలో అంటే?

Published: 22-07-2025, 3:59 AM
ఇద్దరు క్యూట్ భామలతో టాక్ షో.. మరో రేంజ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌.. ఏ ఓటీటీలో అంటే?

ఓటీటీ లో టాక్ షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కాజోల్ మరియు ట్వింకిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.

Key Points

1

కాజోల్ మరియు ట్వింకిల్ ఖన్నా కలిసి ఓ టాక్ షో చేస్తున్నారు.

2

ఈ టాక్ షో పేరు 'టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్'.

4

ఓటీటీలో టాక్ షోలకు మంచి ఆదరణ ఉంది.

కాజోల్ మరియు ట్వింకిల్ ఖన్నా కలిసి

ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ రూల్ చేస్తున్నాయి. అయితే మరోవైపు టాక్ షోలకు కూడా మంచి ఆదరణ ఉంది. సెలబ్రిటీల టాక్ షోకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ ఓటీటీ సంస్థ క్రేజీ టాక్ షోతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. దీని అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

బాలీవుడ్ లో కాజోల్ , ట్వింకిల్ ఖన్నాలకు వేరే లెవల్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు క్యూట్ భామలు కలిసి టాక్ షో తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ పేరుతో ఓటీటీలోకి టాక్ షో రాబోతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కాబోతోంది.

‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ టాక్ షో

టాక్ షో పేరును అనౌన్స్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ‘‘వాళ్ల దగ్గర టీ ఉంది. దీన్ని మిస్ చేయడం టూ మచ్. టూ మచ్ ఆన్ ప్రైమ్, త్వరలోనే’’ అనే క్యాప్షన్ తో పోస్టర్ పోస్టు చేసింది.

50 ఏళ్ల వయసులోనూ అదే అందంతో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు కాజోల్. రీసెంట్ గా ‘మా’ సినిమాతో థియేటర్లలో ఆడియన్స్ ను పలకరించింది. ఇప్పడు రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. సార్జామీన్, మహారాగ్ని సినిమాలు చేస్తున్నారు కాజోల్.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

మరోవైపు 2001లో అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ట్వింకిల్ ఖన్నా యాక్టింగ్ కు గుడ్ బై చెప్పారు. అంతకుముందు 1995 నుంచి 2001 వరకు హిందీలో వరుసగా సినిమాలు చేశారు. తెలుగులో వెంకటేష్ సరసన శీను మూవీ చేశారు. ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు నిర్మించారు.

ఓటీటీ లో టాక్ షో ట్రెండ్ కొనసాగుతోంది. టీవీలతో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ లనూ వీటి హవా కొనసాగుతోంది. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ బాగా పాపులర్. కమెడియన్ కపిల్ శర్మ.. సెలబ్రిటీలతో చేసే సందడి వేరే లెవల్. ‘కాఫీ విత్ కరణ్’ కూడా హిట్ టాక్ షో. ఇక తెలుగులో బాలయ్య బాబు ‘అన్ స్టాపబుల్’, రానా ‘ది రానా దగ్గుబాటి షో’ కూడా పాపులరే. ఇప్పుడు ఇదే బాటలో టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ వస్తుంది.

కాజోల్ మరియు ట్వింకిల్ ఖన్నా కలిసి చేస్తున్న ఈ టాక్ షో ఓటీటీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.