|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ న్యూస్: ఉదయ్ కిరణ్ నో చెప్పడంతో.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడంతే!

Published: 12-02-2026, 10:05 PM
షాకింగ్ న్యూస్: ఉదయ్ కిరణ్ నో చెప్పడంతో.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ కొట్టాడంతే!
  • ఉదయ్ కిరణ్ కెరీర్‌ను మార్చేసిన ‘అతడు’ సినిమా మిస్ చేసుకున్న వైనం!
  • మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం అతడు
  • మురళీ మోహన్ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడి
  • హీరో ఉదయ్ కిరణ్ జీవితంలో ఎదురైన సవాళ్లు, విషాదకర పరిస్థితులు

టాలీవుడ్ లో ఒక సంచలనం! ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేసిన సినిమాతో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే చదవండి!

ఉదయ్ కిరణ్ కెరీర్ టర్నింగ్ పాయింట్ మిస్?

టాలీవుడ్‌లో ఎంతో వేగంగా స్టార్ హీరోగా ఎదిగి, అదే వేగంతో డౌన్ ఫాల్‌ను ఎదుర్కొన్న నటుల్లో ఉదయ్ కిరణ్ ఒకరు. యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించిన ఈ హీరో, జీవితంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులతో తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఒక దశలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో డిప్రెషన్‌కు లోనై, 2014లో తన నివాసంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యంగ్ స్టార్.. కేవలం 33 ఏళ్ల వయసులో మరణించడం ఫిల్మ్ ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది.

చిత్రం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు పొందారు. ఆ వెంటనే ఆయనకు అనుకోకుండా నువ్వు నేను సినిమా అవకాశం వచ్చింది. నిజానికి ఈసినిమాను తరుణ్ హీరోగా తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ అతను బిజీగా ఉండటంతో ఉదయ్ కిరణ్ కు అదృష్ట అప్పుడు కలిసి వచ్చింది. నువ్వు నేను సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. యూత్ ఆడియన్స్ లో ఉదయ్ కిరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా అవకాశాలు అతని తలుపు తట్టాయి.

ఇక ఉదయ్ కిరణ్ వరుసగా ‘మనసంతా నువ్వే’, ‘కలుసుకోవాలని’, ‘హోలీ’, ‘నీ స్నేహం’, ‘ఔనన్నా కాదన్నా’ వంటి ప్రేమకథా చిత్రాలతో యూత్ ఆడియన్స్ ను కంప్లీట్ గా తనవైపు తిప్పుకున్నాడు. లవర్ బాయ్ గా అమ్మాయిల హృదయాల్లో స్థానం సంపాదించారు.

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ వెనుక అసలు కథ

చిన్న వయసులోనే ఫిల్మ్ ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా అందుకున్నారు. కానీ ఒక దశలో వరుస ఫ్లాపులు ఆయన కెరీర్‌ను ప్రభావితం చేశాయి. ‘ఔనన్నా కాదన్నా’ తర్వాత దాదాపు పది సినిమాల్లో నటించినప్పటికీ, ఏ ఒక్క చిత్రం కూడా విజయాన్ని సాధించలేదు. ఈ పరిస్థితులు ఆయన భవిష్యత్తుపై ప్రభావం చూపించాయి.

ఉదయ్ కిరణ్ తన కెరీర్ లో ఓ సినిమా మిస్ అయ్యి చాలా తప్పు చేశాడు.. ఆ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది. ఆమూవీ మరేదో కాదు అతడు. మహేష్ బాబు కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అతడు మొదట ఉదయ్ కిరణ్‌కు ఆఫర్ చేశారు. ఫస్ట్ సినిమ చిత్రం తరువాత ఈసినిమా ఆఫర్ ఆయనకు వచ్చిందట.

నువ్వు నేను తో మరో హిట్ కొట్టడంతో.. అతను సినిమాను ఉదయ్ తోనే చేయాలని ఫిక్స్ అయ్యారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2005లో విడుదలై ఘనవిజయం సాధించింది. అయితే ఈసినిమాను ఉదయ్ కిరణ్ ఎలా మిస్ అయ్యాడు?

మురళీ మోహన్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు

ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాత… ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరళీ మోహన్ మాట్లాడుతూ.. ” ఉదయ్ కిరణ్ చిత్రం సినిమా సూపర్ హిట్ అయిన తరువాత నేను అతనికి ఫోన్ చేశాను. బాగా చేశావయ్య..మంచి భవిష్యత్తుఉంది నీకు అని చెప్పాను. దాంతో అతను మురళీ మోహన్ గారు మీరు ఫోన్ చేశారా.. చాలాసంతోషం అండీ.. నేను వచ్చి కలుస్తాను అని అన్నాడు.. చెప్పినట్టే ఇంటికి వచ్చి కలిశాడు.

అతడు సినిమాను ఉదయ్ కిరణ్ తోనే ప్లాన్ చేశాము. అతను కూడా చేస్తా అన్నాడు. ఆసినిమా స్టార్ట్ అయ్యే టైమ్ కి చిరంజీవి గారి కూతురితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడం.. ఆతరువాత ఓ కన్ఫ్యూజన్ లో అతను ఉండిపోయాడు. ఆతరువాత అడిగితే.. అయ్యో నేను మర్చిపోయానండి.. ఇప్పుడు డేట్స్ వేరే సినిమాకు ఉన్నాయి.. అన్నాడు. నెక్ట్స్ ఇయర్ వరకు ఆగాల్సి రావడంతో.. ఈ కథ మహేష్ దగ్గరకు వెళ్లింది” అని మురళీ మోహన్ అన్నారు.

ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. త్వరలో మరిన్ని ఆసక్తికర విషయాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.