|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉదయభాను సంచలన వ్యాఖ్యలు! రాజీవ్ కనకాల షాక్! స్టేజ్ మీదే ఇచ్చి పడేసిందిగా!!

Published: 05-03-2026, 8:35 AM
  • ఉదయభాను యాంకరింగ్‌తో ఒకప్పుడు టాలీవుడ్‌లో సంచలనం!
  • D/O ప్రసాద్ రావు కనబడుటలేదు వెబ్ సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా ఉదయభాను దుమ్మురేపింది!
  • రాజీవ్ కనకాలతో కలిసి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు రికార్డు స్థాయి వ్యూస్!
  • వెబ్ సిరీస్ సక్సెస్ మీట్‌లో రాజీవ్ కనకాలపై ఉదయభాను చేసిన కామెంట్స్ వైరల్!

తెలుగు యాంకరింగ్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఉదయభాను మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఉదయభాను రీఎంట్రీతో టాలీవుడ్‌లో హీట్!

దాదాపు 20 సంవత్సరాల క్రితమే తెలుగులో యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఉదయభాను ఒకరు. ఈమె యాంకర్ గా కొనసాగుతున్న సమయంలో ఆమె దరిదాపుల్లోకి కూడా వేరే వారు రాలేదు. అంతలా పాపులారిటీని సంపాదించుకున్న ఈ నటి ఆ సమయంలో చాలా తక్కువ సినిమాల్లోనే నటించింది. కేవలం ఉదయభాను యాంకరింగ్ పైనే దృష్టి పెట్టి అలాగే అనేక సంవత్సరాలు స్టార్ యాంకర్ గా కెరీర్ను కొనసాగించింది. ఇప్పటికీ కూడా ఉదయభానుకు మంచి గుర్తింపు ఉంది.

రాజీవ్ కనకాలపై ఉదయభాను సెటైర్లు వైరల్!

కొన్ని సంవత్సరాల క్రితం ఈమె పలు సినిమాలలో ఐటమ్ పాటలలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాల్లో కీలక, ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈ నటి D/O ప్రసాద్ రావు కనబడుటలేదు అనే వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సిరీస్లో ఉదయభాను పాత్రకు అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుండడంతో దీని ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా ముఖ్య పాత్రలో నటించాడు.

D/O ప్రసాద్ రావు వెబ్ సిరీస్‌కు అదిరిపోయే రెస్పాన్స్!

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు అద్భుతమైన రీతిలో ప్రేక్షకాదరణ దక్కుతుంది. కేవలం వారం రోజుల్లోనే దీనికి 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దక్కినట్లు ఈ సంస్థ ప్రకటించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ బృందం ఓ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. అందులో ఉదయభాను, రాజీవ్ కనకాల కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో భాగంగా రాజీవ్ కనకాల, ఉదయభానును రెండు సార్లు వెనక్కి తిరిగి చూశాడు. ఆ తర్వాత ఉదయభాను మీరు నన్ను రెండుసార్లు వెనక్కు తిరిగి చూశారు, దీన్ని కూడా కొంతమంది సంచలనం చేస్తారు. అలాంటి వారు కూడా మన సమాజంలో ఉన్నారు అని వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఉదయభాను కామెంట్స్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ఈ వెబ్ సిరీస్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.