|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Instagram hacked: స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ఇన్‌స్టా హ్యాక్.. ఆ మెసేజులు నేను పెట్టడం లేదు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ విజ్ఞప్తి

Published: 08-07-2025, 7:16 AM
Instagram hacked: స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ఇన్‌స్టా హ్యాక్.. ఆ మెసేజులు నేను పెట్టడం లేదు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ విజ్ఞప్తి

ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తన పేరుతో వస్తున్న మెసేజ్‌లు నేను పెట్టినవి కాదని, అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Key Points

1

మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయింది.

2

అతని ఖాతా నుండి వచ్చే సందేశాలు, లింకులు తెరవకండి.

4

సైబర్ అధికారుల సహాయంతో ఖాతాను తిరిగి పొందే ప్రయత్నంలో ఉన్నారు.

ఉన్ని ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాకింగ్

ఈ మధ్య కాలంలో నటీనటులకు సంబంధించిన సోషల్ మీడియాల అకౌంట్స్ ఎక్కువగా హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాటిని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సామాన్యులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ఇన్‌స్టా హ్యాక్ అయినట్లు తెలుస్తుంది. మలయాళ స్టార్ట్ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan).. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయినట్లు ఫేస్‌బుర్ ద్వారా తెలిపారు. తన ఇన్‌స్టా నుంచి వస్తున్న అప్డేట్‌లు, మెసేజులు తాను పంపిస్తున్నవి కావని స్పష్టం చేశారు. DM (సందేశాలు), స్టోరీలు, ఇతర విషయాలు కూడా తాను షేర్ చేయడం లేదని, హ్యాక్ అయిన తన అకౌంట్ నుంచి ఎలాంటి సందేశాలు వచ్చిన, లింకులు వచ్చిన వాటిని ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అలాగే ఈ ప్రాబ్లెమ్‌ను పరిష్కరించడానికి.. తన అకౌంట్‌ను తిరిగి పొందడానికి తనతో పాటు సైబ‌ర్ అధికారులు ప‌నిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సమస్య పూర్తిగా పరిష్కరించబడిన తర్వాత త‌న ఫేస్‌బుక్ ద్వారా అభిమానులకు అప్‌డేట్ చేస్తానని తెలిపారు ఉన్ని ముకుందన్.

మోసాలకు హెచ్చరిక

సైబర్ నేరాలపై అప్రమత్తత

ఉన్ని ముకుందన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అతని అభిమానులు సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.