|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యూపీలో దారుణం: కోట్ల ఆస్తి తీసుకున్నా, కన్నతండ్రిని తుపాకీతో కాల్చి చంపిన కొడుకు!

Published: 17-07-2026, 1:05 AM
  • యూపీలోని గాజియాబాద్‌లో కోట్ల ఆస్తి కోసం కన్నతండ్రిని కొడుకు కాల్చి చంపాడు.
  • హరి ఓం ఛౌదరి అనే భూస్వామికి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు నిఖిల్ ఆస్తి కోసం వేధించేవాడు.
  • తండ్రి ఇప్పటికే 15 ఎకరాల భూమిని ఇచ్చినా, నిఖిల్ మిగిలిన ఆస్తి కోసం ఒత్తిడి చేశాడు.
  • మద్యం మత్తులో తండ్రితో గొడవపడి, తుపాకీతో కాల్చి హతమార్చిన నిఖిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

యూపీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కోట్ల ఆస్తిని రాసిచ్చినా, మిగిలిన ఆస్తి కోసం కన్నతండ్రిని తుపాకీతో కాల్చి చంపిన కొడుకు ఉదంతం కలకలం రేపింది. గాజియాబాద్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

ఆస్తి కోసం తండ్రిని వేధించిన కొడుకు

యూపీలో దారుణం చోటు చేసుకుంది. కోట్ల ఆస్తి రాసిచ్చినా ఇంకా కావాలంటూ ఓ కొడుకు తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న యూపీలోని గాజియాబాద్ లోని మోదీన‌గ‌ర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మోడీ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న బుడానా గ్రామంలో హ‌రి ఓం ఛౌద‌రి అనే భూస్వామి రైతుకు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు నిఖిల్ కాగా చిన్న కుమారుడు నీషూ. వీరిలో పెద్దకుమారుడు నిఖిల్ మ‌ద్యానికిర బానిసై డ‌బ్బుల కోసం త‌ర‌చూ తండ్రిని వేధించ‌డం మొద‌లు పెట్టాడు.

తండ్రికి మొత్తం 47ఎక‌రాల భూమి, ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉండ‌గా వాటిలో ఇప్ప‌టికే 15 ఎక‌రాల భూమిని రాసిచ్చాడు. అయిన‌ప్ప‌టికీ మిగితా ఆస్తిని సైతం త‌న‌పేరిట రాయాల‌ని నిఖిల్ తండ్రిని వేధించ‌డం మొద‌లుపెట్టాడు. కానీ అందుకు తండ్రి నిరాక‌రించాడు. దీంతో కోపంతో ర‌గిలిపోయిన నిఖిల్ మ‌ద్యం మ‌త్తులో ఇంటికి వెళ్లాడు. అదే స‌మ‌యంలో తండ్రి మంద‌లించ‌డంతో ఆస్తి విష‌యంలో గొడ‌వ పెట్టుకుని తుపాకీతో కాల్చి హ‌త‌మార్చాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పొలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో దారుణ హత్య

పోలీసుల అదుపులో నిందితుడు

ఆస్తి కోసం కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన ఈ ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంతగా దిగజారుతున్నాయో స్పష్టం చేస్తోంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.