
📌 Key Points
- పోకో X8 ప్రో మాక్స్ 5G: 100W ఛార్జింగ్, 9000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 9500s ప్రాసెసర్ తో వస్తుంది.
- వివో T5x 5G: 7200mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ కలిగి ఉంది.
- శాంసంగ్ గెలాక్సీ M17e 5G: 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో వస్తుంది.
- మార్చి 17న పోకో X8 ప్రో సిరీస్, వివో T5x 5G, శాంసంగ్ గెలాక్సీ M17e 5G ఫోన్లు విడుదల కానున్నాయి.
భారత మార్కెట్లో సరికొత్త 5జీ ఫోన్లు విడుదల కానున్నాయి. పోకో ఎక్స్8 ప్రో సిరీస్, వివో టీ5ఎక్స్ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ వంటి ఫోన్లు మార్చి 17న విడుదల కానున్నాయి. వీటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోకో X8 ప్రో సిరీస్ ఫీచర్లు
Upcoming 5G Phones : భారత మార్కెట్లో సరికొత్త 5జీ ఫోన్లు రాబోతున్నాయి. పోకో ఎక్స్8 ప్రో నుంచి వివో టీ5ఎక్స్ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
Upcoming 5G Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రాబోయే వారంలో భారతీయ మొబైల్ మార్కెట్లో కొత్త మొబైల్ ఫోన్లు రాబోతున్నాయి. మార్చి 17న ఒకే రోజున 4 ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇందులో పోకో X8 ప్రో సిరీస్, వివో T5x 5జీ, శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ వంటి ఫోన్లు ఉన్నాయి.
పోకో భారీ 9000mAh బ్యాటరీతో రానుండగా, శాంసంగ్ 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించనుంది. ఈ ఫోన్‌లు గేమింగ్, అడ్వాన్స్ ఏఐ ఫీచర్ల కోసం 120fps సపోర్టుతో వస్తాయి. రాబోయే ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
వివో T5x 5జీ ప్రత్యేకతలు
పోకో X8 ప్రో మాక్స్ 5G : పోకో నుంచి ఈ ఫ్లాగ్‌షిప్ కిల్లర్ స్మార్ట్‌ఫోన్ త్వరలో రాబోతుంది. మార్చి 17వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు పోకో X8 ప్రో మాక్స్ 5జీ లాంచ్ అవుతుంది. 100W సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, భారీ 9000mAh బ్యాటరీతో రానుంది.
గేమింగ్ ప్రియుల కోసం 24GB వరకు ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌తో వస్తుంది. 120fps స్మూత్ గేమింగ్, ఐస్ లూప్ కూలింగ్ చాంబర్, గేమ్ HDR వంటి ఫీచర్లు ఫోన్ వేడెక్కకుండా కంట్రోల్ చేస్తాయి. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, అడ్వాన్స్ ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి.
Read Also : Moto G35 5G : మోటోరోలానా మజాకా.. ఈ మోటో G35 5G ఫోన్ జస్ట్ రూ. 12,999 మాత్రమే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ విశేషాలు
పోకో X8 ప్రో 5G : కంపెనీ మాక్స్ వేరియంట్, పోకో ఎక్స్ 8 ప్రో 5జీ ఫోన్ త్వరలో లాంచ్ చేయనుంది. బడ్జెట్‌లో అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్. ఇందులో డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్, పవర్‌ఫుల్ 6500mAh బ్యాటరీ ఉన్నాయి. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడా వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ రియర్ కెమెరాలు, గేమింగ్-సెంట్రిక్ ఫీచర్లతో మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో వస్తుంది.
వివో T5x 5జీ : వివో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వివో T5x 5జీ వచ్చేస్తోంది. మార్చి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. భారీ 7200mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. మిలిటరీ-గ్రేడ్ ప్రొటెక్షన్ ఉంది. వివో అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈజీగా కొనేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ : శాంసంగ్ గెలాక్సీ M17e 5జీ ఫోన్ అతి త్వరలో రాబోతుంది. మార్చి 17న ఈ శాంసంగ్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బడ్జెట్ ఫోన్ కోసం శాంసంగ్ 6 ఏళ్ల OS అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, గూగుల్ పాపులర్ ‘సర్కిల్ టు సెర్చ్’ ఏఐ ఫీచర్‌తో వస్తుంది.
భారతీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ 5జీ ఫోన్లు వినియోగదారులకు సరికొత్త ఎంపికలను అందిస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీలతో ఇవి ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు.

