|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ విధ్వంసం! బ్లాక్ బస్టర్ హిట్టేనా? 💥రివ్యూ!

Published: 19-03-2026, 3:35 AM
ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కళ్యాణ్ విధ్వంసం! బ్లాక్ బస్టర్ హిట్టేనా? 💥రివ్యూ!
  • పవన్‌ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు.
  • హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా భారీ అంచనాలతో విడుదల.
  • పవన్‌ కళ్యాణ్ విశ్వరూపం, హరీష్ శంకర్ మార్క్ డైరెక్షన్ సినిమాకి హైలైట్ అంటున్నారు.
  • ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కామెడీ, యాక్షన్ సీన్స్ అభిమానులకు ఫుల్ మీల్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి చదవండి!

పవన్ కళ్యాణ్ మాస్ అవతార్!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`తో వచ్చారు.  హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు గురువారం ఉగాది పండగ సందర్భంగా (మార్చి 19)న విడుదలైంది.  మొన్న ట్రైలర్‌, ఆ తర్వాత ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో మూవీకి మంచి బజ్‌ ఏర్పడింది. అంతకు ముందు బజ్‌ పెద్దగా లేదు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా వస్తుందంటే ఆ హడావుడి, అభిమానుల హంగామా వేరేలా ఉంటుంది, కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం సీన్‌ రివర్స్ లా ఉండింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌(పవన్‌ కళ్యాణ్‌) అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోతారు. దీంతో అతన్ని నల్లమల్ల ఫారెస్ట్ లోని లింగయ్యగూడెం ప్రజలు చేరదీస్తారు. ఆ సమయంలో ఆ ఊరి స్కూల్‌కి కొత్తగా వచ్చిన హెడ్‌ మాస్టర్‌ చంద్రశేఖర్‌(కేఎస్‌ రవికుమార్‌) ఇతన్ని చూసి చిన్నయ్యగా ఉన్న పేరుని కాస్త.. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ గా పేరు మార్చి చదువు చెబుతాడు. గొప్పగా తయారయ్యే విషయాలు చెబుతాడు. చంద్ర శేఖర్‌ అప్పటి సీఎం(మురళీ మోహన్‌) కోరిక మేరకు రాజకీయాల్లోకి వెళ్తాడు. సీఎం అవుతాడు. ఉస్తాద్‌ ఐపీఎస్‌ అవుతాడు. కానీ అతను ఫారెస్ట్‌లో ఉండిపోతాడు. ఓ ఫంక్షన్‌లో సీఎంపై ఎటాక్‌ జరుగుతుంది. ఆ స్థానంలో ఇతర నాయకులు సీఎంలు అవుతారు. కానీ వాళ్లు చనిపోతారు. ఇదంతా చేస్తున్నది నల్ల నాగప్ప(పార్థిబన్‌). తాను సీఎం కుర్చీపై కూర్చునేందుకు ఇదంతా చేస్తుంటాడు. తన గురువు చంద్రశేఖర్‌ పై కూడా నాగప్ప ఎటాక్‌ చేశాడని ఉస్తాద్‌కి తెలుస్తోంది. దీంతో అతన్ని కట్టడి చేయడానికి ఉస్తాద్‌ గేమ్‌ ఆడతాడు. ఆ గేమ్‌ ఏంటి? నల్ల నాగప్పకి, ఉస్తాద్‌ కి ఉన్న పాత గొడవేంటి? ఇందులో శ్లోక(రాశీఖన్నా), లీలా(శ్రీలీలా) పాత్రలేంటి? అవి ఉస్తాద్‌ని ఎలా ప్రభావితం చేశాయి? శ్లోకాలో ఉస్తాద్‌ తెచ్చిన మార్పేంటి? లీలాతో ఆయన లవ్‌ ట్రాక్‌ ఎలా సాగింది? రాష్ట్ర రాజకీయాల్లో ఉగ్రవాదుల ప్రమేయం ఏంటనేది `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మిగిలిన స్టోరీ.

దర్శకుడు హరీష్‌ శంకర్‌ చెప్పినట్టు ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పూర్తి స్థాయి పక్కా కమర్షియల్‌ మూవీ. కామెడీ, పాటలు, ఫైట్లు, హీరో విలన్‌ మధ్య వార్‌, ఉగ్రవాదం, లవ్‌ ట్రాక్‌, సెంటిమెంట్లు ఇలా అన్ని అంశాలను మేళవించిన వండిన వంటకంగా చెప్పొచ్చు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఇలాంటి మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌ తీయడంలో దిట్ట. దీన్ని అదే తరహాలో రూపొందించారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని అభిమానులకు కావాల్సిన అంశాలను జోడించి రూపొందించారు. చాలా వరకు వింటేజ్‌ పవన్‌ కళ్యాణ్‌ ని చూపించారు. ఆయన డాన్సులు, ఆయన సినిమాల్లోని పాటలు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లతో మూవీని నడిపించారు. దీనికితోడు `గబ్బర్‌ సింగ్‌`లోని అంత్యాక్షరి తరహాలో ఇందులోనూ ఇతర హీరోల సినిమా పాటలు పెట్టి, వాటికి పవన్‌ డాన్స్ చేయడం వంటి సీన్లని పెట్టి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో దేశభక్తి, హిందుత్వం అంశాలకు ప్రయారిటీ ఇచ్చారు. దేశం, మన సాంప్రదాయం గొప్పతనం చెప్పే ప్రయత్నం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలంటే చాలా వరకు హిందుత్వం, మన దేశ ధర్మాలుంటాయి. ఇందులోనూ అవే చెప్పారు. అయితే ఇవన్నీ రొటీన్‌ ఎలిమెంట్లుగా చెప్పొచ్చు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇలాంటి సందేశాలను చెప్పించారు. సినిమాగా చూసినప్పుడు మొదట సీఎంపై ఎటాక్‌ జరగడం, దీంతో మరో అపధర్మ సీఎం కావడం, అతను కూడా చనిపోవడంతో ఇంతలో పార్థిబన్‌ తానే ఇవన్నీ చేశానని బెదిరించి సీఎం కావడం వరకు మూవీ సీరియస్‌గా సాగుతుంది. అదే సమయంలో నల్లమల్ల ఫారెస్ట్ లో చిన్నయ్యగా ఉన్న పవన్‌ని హెడ్‌ మాస్టర్‌ వచ్చి ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌గా మార్చడం, అతను గొప్ప నాయకుడు అవుతాడని ముందే చెప్పడంతో హీరో తాలూకు పాత్ర తీరుతెన్నులను చూపించారు. అనంతరం మాదక ద్రవ్యాల సరఫరా విషయంలో సీఎం కొడుకొని అడవిలో దాచిపెట్టడంతో అసలు వార్‌ స్టార్ట్ అవుతుంది. ఇందులో దాదాపు అరగంట తర్వాత పవన్‌ ఎంట్రీ ఉంటుంది. పోలీస్‌ స్టేషన్‌ లో యాక్షన్‌ సీన్‌తో ఆయన ఎంట్రీ ఇస్తాడు. కాకపోతే అది అదిరిపోయింది. ఇప్పుడు ట్రెండీ యాక్షన్‌ని ఫాలో అయ్యారు. స్టేషన్‌లో ఊచకోత ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ రాశీఖన్నా ఎంట్రీ ఉంటుంది. ఆమెతో సీన్లు కామెడీగా ఉంటాయి. ఈ క్రమంలో డాన్సులు వేయడం, పార్టీ సన్నివేశాలు నవ్విస్తాయి. ఇందులో భాగంగానే ఇతర హీరోల సినిమాల పాటలకు పవన్‌ డాన్సులు వేయడం కామెడీగా ఉంది. పాట ఏదైనా తన డాన్స్ ఇదే అని పవన్‌ చెప్పిన తీరు నవ్వులు పూయిస్తుంది. అది మీమర్స్ స్టఫ్‌గా చెప్పొచ్చు. ఫస్టాఫ్‌ అంతా స్లోగా, రొటీన్‌గానే సాగుతుంది. సీఎం కొడుక్కి తన గతాన్ని చెప్పడంతో మూవీ అసలు కథలోకి వెళ్తుంది. తన నాన్నతో గొడవేంటి? ఎందుకు కిడ్నాప్‌ చేయాల్సి వచ్చిందని వివరించడం, ఈ క్రమంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌ మూవీ రేసీగా వెళ్తుంది. శ్రీలీల ట్రాక్‌ ఆకట్టుకుంటుంది. ఉగ్రవాదుల ఎంట్రీ, పవన్‌ యాక్షన్‌, ఉపదేశాలతో సాగుతుంది. అదే సమయంలో విలన్లు, లీలా ఫ్రెండ్‌పై అఘాయిత్యానికి పాల్పడే సీన్‌ గుండెని బరువెక్కిస్తుంది. అనంతరం విలన్‌పై ప్రతీకారం, ఈ క్రమంలో హీరో వేసే ఎత్తులు, వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటున్నాయి. క్లైమాక్స్ రెగ్యూలర్‌గానే ముగుస్తుంది.

హరీష్ శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది?

సినిమాలో పవన్‌ కామెడీ, డాన్సులు, యాక్షన్‌ సీన్లు సినిమాకి ప్లస్‌ అవుతాయి. రాశీఖన్నా సీన్లు, శ్రీలీల సీన్లు మెప్పిస్తాయి. విలన్‌తో సవాళ్లు, వార్నింగ్‌లు ఆకట్టుకుంటాయి. పాటల అంత్యక్షరి ఎపిసోడ్‌ నవ్విస్తుంది. సెకండాఫ్‌ ఫర్వాలేదు. `తొలిప్రేమ`, `ఖుషి` సినిమాల్లోని పాటలు మళ్లీ గతంలోకి తీసుకెళ్తాయి. అవి మూవీకి హైలైట్‌గా నిలుస్తాయి. పవన్‌ నటన మెప్పిస్తుంది. అభిమానులను ఉద్దేశించి పెట్టిన యాక్షన్‌, పాటలు, కామెడీ ట్రాక్‌ మెప్పిస్తుంది. డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.

కానీ రొటీన్‌ కమర్షియల్‌ మూవీ కావడం మైనస్‌ చెప్పొచ్చు. అంతా ఊహించినట్టు సాగే కథనం, ఫస్టాఫ్‌ మైనస్‌గా చెప్పొచ్చు. ఒరిజినల్‌ సాంగ్స్ అంతగా కిక్‌ ఇవ్వలేదు. బీజీఎం కూడా సినిమా మొత్తం ఒక్కటే వినిపిస్తుంది. సెంటిమెంట్లు సీన్లు మరింత బలంగా రాసుకోవాల్సింది. హితోపదేశాలు ఓవర్‌గా అనిపిస్తాయి ఇటీవల పవన్‌ సినిమాల్లో కామన్‌ అయిపోయాయి. ఉగ్రవాదుల ఎపిసోడ్లు ఇరికించినట్టుగానే ఉన్నాయి. సినిమాలో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. చాలా సీన్లు కట్‌ పేస్ట్ లా ఉన్నాయి, లింక్‌ మిస్‌ అయ్యాయి. సోల్‌ మిస్‌ అయ్యింది.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ ఇరగదీశాడు. ఈమూవీ కోసం ఆయన చాలా కష్టపడ్డాడని ప్రతి సీన్‌లో తెలుస్తుంది. డాన్సుల కోసం, ఫైట్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. మాస్‌ డైలాగ్‌లతో మెప్పించాడు. పవన్‌ పాత్ర అభిమానులకు మంచి ఫుల్‌ మీల్స్ లా ఉంటుందని చెప్పొచ్చు. ఇక శ్రీలీల పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది. ఆమె సీన్లు మెప్పిస్తాయి. తను కూడా బాగానే చేసింది. రాశీఖన్నా ట్రాక్‌ మొదటి భాగంలో ఉంటుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. ఉన్నంతసేపు ఆకట్టుకుంటుంది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది రాశీ. సీఎంగా, హీరోకి గురువుగా కేఎస్‌ రవికుమార్‌ బాగా నటించాడు. మెప్పించాడు. నల్ల నాగప్పగా విలన్‌ పాత్రలో పార్థిబన్‌ బాగా సూట్‌ అయ్యాడు. అదరగొట్టాడు. ఆయనకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తాయి. ప్రభాస్‌ శ్రీను, సత్యం రాజేష్‌ పాత్రలు అలరిస్తాయి. చమ్మక్‌ చంద్ర కాసేపు మెరిశారు. రాంకీ డీజీపీగా గెస్ట్ రోల్‌లో కనిపించాడు. గౌతమీ పాత్ర కూడా బాగుంది. కాకపోతే ఆయమ్మగా ఆమెని ఊహించుకోలేం. శ్రీనాథ్‌ మాగంటికి మంచి రోల్‌ పడింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

శ్రీలీల, రాశి ఖన్నా మెరుపులు!

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గొప్పగా లేదు. `దేఖ్‌ లేంగే` పాట ఫర్వాలేదు. మిగిలిన పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. విజువల్ గా బాగున్నాయి. థమన్‌ బీజీఎం కూడా రొటీన్‌గానే ఉంది. కార్తీక్‌ శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. ఇంకా బాగా చేయాల్సింది. అయనంకా బోస్‌ కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కె దశరథ్‌, రమేష్‌ రెడ్డి కథనం ఫర్వాలేదు. దర్శకుడు హరీష్‌ ఎంచుకున్న కథ రొటీన్‌గా ఉంది. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాలను జనం పెద్దగా చూడటం లేదు. అయినా ఇలాంటి సినిమా చేయడం హరీష్‌ చేసిన సాహసమనే చెప్పాలి. కాకపోతే అభిమానులకు కావాల్సిన విధంగా మూవీని రూపొందించారు. అన్ని అంశాలను పర్‌ఫెక్ట్ గా మేళవించి రూపొందించారు. సినిమాలో ట్విస్ట్ లు ఉన్నా, అవి పెద్దగా కిక్‌ ఇవ్వవు. రొటీన్‌ ఫీలింగ్‌నే తెస్తాయి. నిర్మాణ విలువలకు కొదవ లేదు. రిచ్‌గా తీశారు.

రొటీన్‌ మాస్‌ మసాలా కమర్షియల్‌ మూవీ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`. పవన్‌ అభిమానులకు నచ్చుతుంది. సినీ లవర్స్ మాత్రం కొంత డిజప్పాయింట్‌ అవుతారు.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.