
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది.
- దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పోస్టర్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన డ్రెస్ ధరించి సందడి చేశారు.
- గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.
- ఈ సినిమా ఉగాది సందర్భంగా విడుదల కానుంది, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉగాదికి విడుదల కానుంది. ఈ సందర్భంగా యూసఫ్‌గూడలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. హరీష్ శంకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఘనంగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుక
UBS Pre Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులోని యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు అనే అంశంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ సినిమా వేడుకలో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar)స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈయన ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్టర్ తో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకొని సందడి చేశారు. ఈవెంట్ కోసమే తన కాస్ట్యూమ్ డిజైనర్ ప్రత్యేకంగా ఈ డ్రెస్ డిజైన్ చేయించారని నేను వేసుకోకపోయినా అతను ఊరుకోడు అంటూ హరీష్ శంకర్ మాట్లాడారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హరీష్ శంకర్ డ్రెస్
సాధారణంగా కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతుంటాయి కానీ ఈ సినిమా అవడం గురించి కూడా హరీష్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రీ ఫోన్ కావడంతో పబ్లిసిటీని కూడా అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నామని ఉన్న ఈ తక్కువ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అంటూ పబ్లిసిటీని ఇలా ఒంటికి అతికించుకొని తిరుగుతున్నాను అంటూ హరీష్ శంకర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈయన వేసుకున్న డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ఈ డ్రెస్ చూస్తుంటే మార్కెట్లో ఇది ట్రెండ్ అవ్వబోతుందని చెప్పాలి.
ఇక హరీష్ శంకర్ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ నటించిన రెండో సినిమా కావటం విశేషం. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసాయి. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ లోని డైలాగులు అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్ఛాయని చెప్పాలి. మొత్తానికి ఉగాది పండుగ సందర్భంగా పవన్ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.
ఉగాదికి విడుదల, అంచనాలు పెంచేస్తున్న ట్రైలర్
మొత్తానికి ఉగాది పండుగకు పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా ఉన్నారు. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.


